ఓమిక్రాన్ నేపథ్యంలో కర్ణాటక సీఎం అత్యవసర సమావేశం…

-

దేశాన్ని ఓమిక్రాన్ వైరస్ భయపెడుతోంది. కరోనా కోత్త రూపం ఓమిక్రాన్ కేసులు దేశంలో నమోదవ్వడం దేశ ప్రజల్ని కలవరపరుస్తోంది. కర్ణాటక బెంగళూర్ లో ఇద్దరికి ఓమిక్రాన్ సోకడం వీరితో సన్నిహితంగా ఉన్న మరో 5 మందికి కరోనా సోకింది. ప్రస్తుతం వీరి నమూనాలను కూడా జీనోమ్ సిక్వెన్సింగ్ కోసం పంపించారు. వీటి ఫలితాలు సాయంత్రంలోగా రానున్నాయి. అయితే వీటిపై కర్ణాటక ప్రభుత్వం కూడా అలెర్ట్ అయింది అయితే ప్రస్తుతం ఓమిక్రాన్ వచ్చిన వారిలో ఒకరికి మాత్రమే విదేశాలకు వెళ్లిన ట్రావెల్ హిస్టరీ ఉంది. మరొక వ్యక్తికి ఎలాంటి ఫారెన్ హిస్టరీ లేకున్నా.. ఒక హెల్త్ వర్కర్ కు ఓమిక్రాన్ వేరియంట్ సోకడం కలవరానికి గురిచేస్తుంది.

దీంతో కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మై అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కరోనా కట్టడి, ఓమిక్రాన్ కేసుల నేపథ్యంలో సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈసమావేశంలో ఓమిక్రాన్ కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అధికారులకు దిశానిర్థేశం చేయనున్నారు. ఇప్పటికే బొమ్మై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మండవీయతో సమావేశం అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version