దేశంలో ఓమిక్రాన్ కల్లోలం కొనసాగుతోంది. వరసగా కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో ప్రజల్లో ఆందోళన తలెత్తుతోంది. ఇప్పటికే దేశంలో 150కి పైగా కేసులు నమోదయ్యాయి. కర్ణాటక, ఢిల్లీ, కేరళ రాష్ట్రాల్లో కొత్త ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఈరోజు కర్ణాటకలో 5, కేరళలో 4, ఢిల్లీలో 6 కొత్త ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో కేసుల సంఖ్య 28, కేరళలో 15, కర్ణాటకలో 19కి చేరాయి. దీంతో దేశంలో మొత్తంగా కరోనా బాధితుల సంఖ్య 166 కు చేరింది.
ముఖ్యంగా ఓమిక్రాన్ కేసులు మహారాష్ట్రలను కలవరపరుస్తున్నాయి. ఈ రాష్ట్రంలోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం.. వివిధ రాష్ట్రాల్లో ఓమిక్రాన్ కేసులు సంఖ్య ఇలా ఉంది. మహారాష్ట్ర (54), ఢిల్లీ (28), రాజస్థాన్ (17) మరియు కర్ణాటక (19), తెలంగాణ (20), గుజరాత్ (9), కేరళ (15), ఆంధ్రప్రదేశ్ (1), చండీగఢ్ (1), తమిళనాడు (1) ) మరియు పశ్చిమ బెంగాల్ (1) గా ఉన్నాయి. ప్రస్తుతం నమోదవుతున్న కేసులన్నీ ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి సోకుతున్నాయి.