తెలంగాణ రాష్ట్ర పోలీసులు, డీజీపీ మహేందర్ రెడ్డి లపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఫైర్ అయ్యారు. తెలంగాణ పోలీసులు.. టీఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలలాగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహించారు. ప్రధాని మోడీ దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తుంటే , శవయాత్రలు చేస్తుంటే చోద్యం చూస్తున్నారని నిప్పులు చెరిగారు.
బీజేపీ ఆందోళనలకు అనుమతి ఇవ్వరు కాని.. టీఆర్ ఎస్ పార్టీ నిరసనలకు రక్షణ నిస్తారని ఓ రేంజ్ రెచ్చి పోయారు. ఇదెక్కడి న్యాయం డీజీపీ గారూ అంటూ ప్రశ్నించారుడీకే అరుణ. బీజేపీ కార్యకర్తల ను అరెస్ట్ చేస్తారు… టీఆర్ ఎస్ కార్యక్రమంలో కార్యకర్తల్లా పాల్గొంటారని మండి పడ్డారు. పోలీసుల ద్వంద్వ వైఖరిని ఖండిస్తున్నానని… ప్రజలు అన్ని గమనిస్తున్నారని పేర్కొన్నారు డీకే అరుణ. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు డీకే అరుణ. తెలంగాణ పోలీసులు న్యాయంగా పని చేయాలని కోరారు. ఎప్పుడు ఒకే తెరాస ప్రభుత్వమే ఉండదని గుర్తు పెట్టుకోవాలని పోలీసులకు గుర్తు చేశారు డీకే అరుణ.