యూపీలో మంకీపాక్స్ అనుమానిత కేసులు

-

ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో మంకీపాక్స్ అనుమానిత కేసులు నమోదైనట్లు ఆయా రాష్ట్రాలు ప్రకటన విడుదలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా జిల్లా, ఘజియాబాద్ జిల్లాల్లో రెండు మంకీపాక్స్ అనుమానిత కేసులు గుర్తింనట్లు వైద్య అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో పేషంట్ల రక్తపు నమూనాలను పరీక్షలకు పంపించామన్నారు. రిపోర్టులు ఇంకా రాలేదన్నారు. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో కూడా మంకీపాక్స్ కేసు నమోదైంది. ఈ మేరుకు పేషంట్‌ను ఆస్పత్రిలో జాయిన్ చేయించి చికిత్స అందజేస్తున్నట్లు వైద్యులు తెలిపారు.

మంకీపాక్స్
మంకీపాక్స్

కేరళలో మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా, ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మంకీపాక్స్ పై ఆరోగ్య అత్యవసర పరిస్థితిని విధించింది. మంకీపాక్స్ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా మార్గదర్శకాలు పాటించాలని సూచించారు. వైరస్ వ్యాప్తి అధికంగా గే సెక్స్ నుంచి వ్యాప్తి చెందుతోందన్నారు. వైరస్ కట్టడికి ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news