ఈరోజు అంటే 2021 జూలై 11 నుంచి ఆషాఢ గుప్త నవరాత్రి Ashadha Gupta Navratri ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజులపాటు నిర్వహించే ఈ ఉత్సవంలో అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరిస్తారు. గుప్త నవరాత్రుల్లో ముఖ్యంగా దుర్గామాతను పూజిస్తారు. మహిషాసు పీడను వదిలించి దుర్గామాత శక్తిగా అవతరించింది. వర్షాకాలంలో నిర్వహించే ఈ ఉత్సవాలను శాకంభరి నవరాత్రి లేదా గాయత్రి నవరాత్రి అంటారు. దీన్ని దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు.
ఈ ఏడాది ఆషాఢ గుప్త నవరాత్రి 2021 జూలై 11 నుంచి 18 వరకు నిర్వహించనున్నారు. మొదటి రోజు (ఆదివారం) ప్రతిపాద నుంచి 9వ రోజైన ఆషాఢ శుక్ల పక్ష నవమి వరకు నిర్వహిస్తారు. మన సాంప్రదాయ హిందూ కేలండర్ ప్రకారం ఇది చాలా ముఖ్యమైన ఉత్సవం.
గుప్త నవరాత్రి పూజా విధానం
తొమ్మిది రోజులపాటు నిర్వహించే ఈ ఉత్సవంలో దుర్గామాతను 9 రూపాల్లో పూజిస్తారు. ఆ రూపాలు…
- మాత శైలిపుత్రి
- బ్రహ్మచారిణి
- చంద్రఘంట
- కుష్మాండ
- స్కందమాత
- కాత్యాయినీ
- కాలర్రాతి
- మహాగౌరి
- సిద్ధిదాత్రి.
గుప్త నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటిరోజు పార్వతి మాత మరో అవతారమైన శైలిపుత్రిని రూపంలో భక్తులు పూజిస్తారు. ఈ 9 రోజుల్లో కూడా భక్తులు ఉపవాస కార్యక్రమాలు కూడా నిర్వíß స్తారు. రోజులో ఒక్కసారి మాత్రమే శాఖహారం తీసుకుంటారు. అంతే కాదు ఈ నవరాత్రుల్లో దుర్గామాతకు ఇష్టమైన మంత్రాలను అమ్మవారి అనుగ్రహం కోసం పఠిస్తారు.