అమెరికన్ దేశంలో తపాకీ అలావాటు పెట్రేగిపోతోంది. ఇటీవలే చోటు చేసుకున్న పలు కాల్పుల నేపథ్యంలో న్యూయార్క్ సిటీలో 21ఏళ్లలో పిల్లలకు తుపాకీ వాడకంపై నిషేధం విధించారు. ఈ ఆలోచననను ఇతర ప్రాంతాల్లో కూడా అమలు చేసేందుకు అడుగులు వేస్తున్నారు. అయితే తాజాగా.. నార్వే రాజధాని ఓస్లోలో కాల్పులు కలంకలం సృష్టించాయి. ఓస్లోలోని ఓ నైట్‌క్లబ్‌లో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఇద్దరు మృతిచెందారు.
కాల్పుల ఘటనపై సమాచారం అందడంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. అయితే ఈ కాల్పులో మరో 14 మంది గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. శనివారం నగరంలోని ప్రముఖ లండన్ పబ్ (గే బార్, నైట్ క్లబ్)లో కాల్పులు జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. క్లబ్ సమీపంలో ఒక అనుమానితుడిని పట్టుకున్నామని చెప్పారు. దాడికి గల కారణాలు ఇంకా తెలియరాలేదన్నారు. గాయపడినవారిని దవాఖానకు తరలించామని వెల్లడించారు.