నిన్న స్పైస్‌జెట్‌.. ఈ రోజు ఇండిగో విమానం అత్యవసర ల్యాడింగ్‌..

-

నిన్న 6వేల ఎత్తులో ఉండగా స్పైస్‌జెట్‌ విమానంలో మంటలు చెలరేగడంతో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే నేడు మరో విమానం అత్యవసర ల్యాండింగ్‌ చేయాల్సి వచ్చింది. రెండు విమానాలను పైలెట్లు సురక్షితంగా ల్యాండింగ్ అయిన విమానాశ్రయాల్లోనే తిరిగి టేకాఫ్ చేయడంతో విమాన ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఢిల్లీకి వెళ్లే ఇండిగో ఎయిర్‌బస్ విమానం టేకాఫ్ తర్వాత పక్షి దెబ్బకు గురై గౌహతికి తిరిగి వచ్చింది.‘‘ఇండిగో ఎయిర్‌బస్ ఎ 320 నియో వీటీ ఐటీబీ (VT-ITB) గౌహతి-ఢిల్లీ నుంచి 6ఈ 6394 విమానాన్ని నడుపుతోంది, టేకాఫ్ తర్వాత విమానాన్ని పక్షి ఢీకొన్నందున గౌహతి విమానాశ్రయానికి తిరిగి వచ్చింది. ప్రయాణీకులందరికీ ఢిల్లీకి వెళ్లేందుకు మరో విమానంలో వసతి కల్పించారు. పక్షి ఢీకొన్న ఇండిగో విమానాన్ని తనిఖీ చేస్తున్నామని ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది.

IndiGo to resume scheduled international flights on 150 plus routes- The  New Indian Express

అంతకుముందు ఆదివారం రాత్రి జబల్‌పూర్‌కు వెళ్లే స్పైస్‌జెట్ విమానం 6,000 అడుగుల ఎత్తుకు చేరుకున్నప్పటికీ క్యాబిన్ ప్రెజర్ డిఫరెన్షియల్‌ను తిరిగి పొందడంలో విఫలమవడంతో తిరిగి ఢిల్లీ విమానాశ్రయంలో దిగింది. పట్నా నుంచి ఢిల్లీ బయలుదేరిన ఓ స్పైస్‌జెట్‌ విమాన ఇంజన్‌కు మంటలంటుకున్నాయి. ప్రయాణికులు, కేబిన్‌ సిబ్బంది గమనించి పైలట్లను అప్రమత్తం చేశారు. టేకాఫ్‌ సమయంలో ఓ పక్షి ఢీకొనడం వల్లే ఇంజన్‌లో మంటలు చెలరేగాయని స్పైస్‌జెట్‌ వివరించింది.విమానంలో సాంకేతిక లోపం గురించి ఇంజినీరింగ్ బృందం మరింత విశ్లేషిస్తోందని చెప్పారు విమానయాన అధికారులు.

 

Read more RELATED
Recommended to you

Latest news