నిరుద్యోగులకు శుభవార్త.. టీఎస్పీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్‌..

-

తెలంగాణ సర్కార్‌ రాష్ట్రంలోని అన్ని శాఖల్లో ఉన్న ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు అడుగులు వేస్తోంది. అయితే.. ఉద్యోగ నియామకాల్లో భాగంగా అన్ని శాఖల్లో ఇంజనీరింగ్‌ పోస్టుల భర్తీకి ప్రత్యేకంగా కామన్‌ నోటిఫికేషన్‌ జారీ చేయాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎ్‌సపీఎస్సీ) భావిస్తోంది. ఒక్కో శాఖకు సంబంధించిన ఇంజనీరింగ్‌ పోస్టుల భర్తీకి ఒక్కో నోటిఫికేషన్‌ కాకుండా.. అన్ని శాఖల్లో పోస్టులకు ఒకే నోటిఫికేషన్‌ను జారీ చేయనుంది. దీంతో ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసిన పోస్టుల భర్తీకి వెంటనే నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం లేదు. మిగిలిన విభాగాల్లోని పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాక.. అన్నింటికీ కలిపి కామన్‌ నోటిఫికేషన్‌ను జారీ కానుంది.

Candidates can change nativity, education for jobs: TSPSC

ఫలితంగా ఇంజనీరింగ్‌ పోస్టుల భర్తీ ప్రక్రియ కొంత ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వం ఇటీవలే మునిసిపల్‌, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి వంటి శాఖల్లోని 1,433 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. వీటిని టీఎ్‌సపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. వీటిలో ఎక్కువగా ఇంజనీరింగ్‌ పోస్టులే ఉన్నాయి. సాధారణంగా పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే నోటిఫికేషన్‌ కోసం కమిషన్‌ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, ఇతర విభాగాల్లో కూడా పలు ఇంజనీరింగ్‌ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. వీటి భర్తీ కోసం ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉండడంతో అన్నింటికీ కలిపి ఒకేసారి కామన్‌ నోటిఫికేషన్‌ జారీ చేయాలని టీఎ్‌సపీఎస్సీ భావిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news