తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం కాసేపటి క్రితమే ప్రారంభమైంది. ప్రగతి భవన్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగుతోంది. ఇక ఈ సమావేశానికి తెలంగాణ మంత్రులు, వ్యవసాయ అధికారులు ఇతరులు అందరూ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం లో పండిన ధాన్యం కొనుగోళ్లపై కేబినెట్ చర్చిస్తోంది.
కేంద్రంపై పోరుకు ఎలాంటి కెసిఆర్ కేబినెట్ ఏ నిర్ణయం తీసుకుంటారో నని అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందా ? లేక మిల్లర్లతో ప్రభుత్వమే కొనుగోలు చూపిస్తుందా ? అనే దానిపై ఇవాళ సాయంత్రం కీలక ప్రకటన రానుంది.
ఈ అంశాలపై కేబినెట్ తీవ్రస్థాయిలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిన్న ఢిల్లీలో టిఆర్ఎస్ పార్టీ ధర్నా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ధర్నా సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి 24 గంటల డెడ్ లైన్ సీఎం కేసీఆర్. అయితే దీనిపై కేంద్రం కూడా స్పందించింది. తాము రా రైస్ మాత్రమే కొంటామని పేర్కొంది.