తగ్గనున్న పెట్రోల్, డిజిల్ ధరలు.. .ఉత్పత్తి పెంచనున్న ఒపెక్ దేశాలు

-

దేశంలోనే కాదు.. ప్రపంచం మొత్తం పెట్రోల్ ధరలు విపరీతంగానే ఉన్నాయి. ముఖ్యంగా పెట్రోల్, డిజిల్ ధరలు ఇండియాలో లీటర్ కు సెంచరీకి పైనే ఉన్నాయి. ఎంత తగ్గించినా.. వీటి ధరలు మాత్రం సామాన్యుడికి అందుబాటులోకి రావడం లేదు. దీపావళి కానుకగా గతంలో కేంద్ర ప్రభుత్వం లీటర్ పెట్రోల్ పై రూ. 5, డిజిల్ పై రూ. 10 పన్నులు తగ్గించింది. ఆ తరువాత రాష్ట్రాలు కూడా ఇదే మార్గంలో నడిచాయి. అయినా కూడా పెట్రోల్ రేట్లలో పెద్దగా మార్పు కనిపించడం లేదు. ఇప్పటికీ లీటర్ పెట్రోల్ కు దాదాపుగా వందకు పైనే ఉంటుంది.

ఇండియా పరిస్థితి ఇలా ఉంటే పెట్రోల్, డిజిల్ ను ఎక్కువగా వాడే అమెరికా, చైనా, ఇండియా, జపాన్ దేశాల్లో కూడా పెట్రోల్ రేట్లు అధికంగానే ఉన్నాయి. అయితే రాబోయే కొన్ని రోజుల్లో మాత్రం పెట్రోల్, డిజిల్ రేట్లు తగ్గే అవకాశం కనిపిస్తోంది.

ఆర్గనైజేషన్ ఆప్ పెట్రోలియం ఎక్స్ పోర్టింగ్ కంట్రీస్( ఒపెక్) దేశాలు పెట్రోలియం ఉత్పత్తిని పెంచాలని నిర్ణయించాయి. డిమాండ్ పెరగడంతో ఫిబ్రవరిలో రోజుకు 4 లక్షల బ్యారెళ్ల ఉత్పత్తిని పెంచనున్నట్లు పేర్కొన్నాయి. ఉత్పత్తి పెరిగితే చమురుధరలు అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో పెట్రోల్ రేట్లు అధికంగా ఉన్న ఇండియా వంటి దేశాలకు ఉపశమనం లభించే అవకాశం ఉంది. ఒపెక్ కూటమిలో పెట్రోలియాన్ని ఉత్పత్తి చేసే 13 దేశాలు సభ్యులుగా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version