బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చెయ్యాలనుకుంటున్నారా..? ఇలా అయితే ఎక్కడున్నా అవుతుంది..!

-

చాలా మందికి బ్యాంక్ అకౌంట్ అవసరమన్నా సరే బ్యాంక్ కి వెళ్లి అకౌంట్ ఓపెన్ చెయ్యడం పెద్ద పనిగా భావిస్తారు. మరి కొందరికైతే ఖాళీ ఉండదు. అటువంటి వాళ్ళ కోసం ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఓ అవకాశం ఇస్తోంది.

ఎస్‌బీఐ సరికొత్త ఫెసిలిటీని కొత్త సేవింగ్స్ అకౌంట్ తెరవాలని అనుకునే వాళ్ళ కోసం తీసుకొచ్చింది. దీనితో ఎప్పుడైనా ఎక్కడైనా యోనో యాప్ ద్వారా ఖాతా తెరవచ్చు. అయితే అకౌంట్ ని ఎలా ఓపెన్ చెయ్యాలి అన్నది కూడా ఒక వీడియో ద్వారా ఎస్‌బీఐ తెలిపింది. దాన్ని తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేసింది. బ్యాంక్ కి వెళ్లకుండా ఈ అకౌంట్ తెరవచ్చు.

కేవైసీ వీడియో ఫంక్షన్ ద్వారా సేవింగ్స్ అకౌంట్‌ను ఓపెన్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ ఎంతో ఈజీ కూడా. కేవైసీ ఫీచర్‌ కాంటాక్ట్‌లెస్ ప్రొసీజర్ ద్వారా సేవింగ్స్ బ్యాంకు అకౌంట్‌ను ఎవరైనా సరే ఓపెన్ చెయ్యచ్చు. ఈ ఫీచర్ ద్వారా SBI ఇంస్టా ప్లస్ సేవింగ్ బ్యాంకు అకౌంట్ ను కస్టమర్లు తెరవచ్చు. కేవైసీ తో దీని ప్రక్రియను పూర్తి అవుతుంది బ్యాంక్ కి వెళ్ళక్కర్లేదు. ఆధార్ వివరాలు, పాన్ మాత్రమే దీని కోసం అవసరం అవుతాయి.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version