ఎటువంటి పరీక్ష లేకుండా ఉద్యోగం పొందే అవకాశం.. ఇలా అప్లై చేసుకోండి..

-

గవర్నమెంట్ ఉద్యోగం కోసం ట్రై చేస్తున్న వారికి అదిరిపొయె గుడ్ న్యూస్.. ఎటువంటి పరీక్ష లేకుండా ఉద్యోగం పొందే సువర్ణ అవకాశం..ఆ ఉద్యోగాల గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం..

ఇంటెలిజెన్స్ బ్యూరో అడ్వైజర్/టెక్, డిప్యూటీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, డిప్యూటీ డైరెక్టర్/టెక్, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్/క్రిప్టో పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది..గ్రూప్ ఎ అధికారులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు..సలహాదారు / టెక్, డిప్యూటీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, డిప్యూటీ డైరెక్టర్ / టెక్, అదనపు డిప్యూటీ డైరెక్టర్ / క్రిప్టో, జాయింట్ డిప్యూటీ డైరెక్టర్ / X, అసిస్టెంట్ డైరెక్టర్ / X ఉద్యోగాలు ఉన్నాయి..

ఇకపోతే..కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రిక్రూట్‌మెంట్ కింద ఇంటెలిజెన్స్ బ్యూరో లో సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడించారు. ఈ పోస్టులను డిప్యుటేషన్‌ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు..ఈ ఉద్యొగాలకు అర్హులైన వారు 3 నుంచి 5 యేళ్ల వరకు పదవిలో కొనసాగవచ్చు..ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 157 పోస్టులను భర్థీ చేయనున్నారు..గత నెల 27 న ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.ఆఫ్ లైన్ విధానంలో పంపించాల్సి ఉంటుంది.రెండు నెలల పాటు దరఖాస్తు చేసుకోవచ్చు..

పూర్తి వివరాలు..

డిప్యూటీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ 118 పోస్టులు, సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్ 2 పోస్టులు, అడ్వైజర్/టెక్ ఒక పోస్టు, డిప్యూటీ డైరెక్టర్ రెండు పోస్టులు, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ ఒక పోస్టు, జాయింట్ డిప్యూటీ డైరెక్టర్ 13 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.ఇవి కాక..అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు మరో 20 ఉన్నాయి..స్పెషల్‌ సెక్యురిటీ అలవెన్స్‌ కింద 20 శాతం వరకు బేసిక్‌ జీతం వీరికి చెల్లిస్తారు. యూనిఫాం అలవెన్స్ కింద నెలకు రూ.10 వేలు చెల్లిస్తారు. చిల్డ్రన్‌ ఎడ్యుకేషన్‌ అలవెన్స్‌ కింద రూ.27,000ల వరకూ అదనంగా చెల్లిస్తారు.

ఈ ఉద్యోగాలకు అర్హత గల అధికారులు..దరఖాస్తును అసిస్టెంట్ డైరెక్టర్, ఇంటెలిజెన్స్ బ్యూరో, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, 35 SP మార్గ్, బాపు ధామ్, న్యూఢిల్లీ – 110021 అడ్రస్ కి తమ దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలను దరఖాస్తులో వివరంగా నమోదు చేసి.. అర్హత సర్టిఫికేట్ల జిరాక్స్ లను పోస్టు ద్వారా పంపించాల్సి ఉంటుంది.మరిన్ని వివరాలకు https://www.mha.gov.in/వెబ్ సైట్ ను చూసి పూర్తి సమాచారం తెలుసుకోని అప్లై చేసుకోవాలి..

Read more RELATED
Recommended to you

Latest news