పాకిస్థాన్ ప్రధాని అభ్యర్థిగా ప్రతిపక్ష నేత షెహెబాజ్..!

-

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌ ప్రతిపక్ష నేత షెహబాజ్‌ షరీఫ్‌ ప్రధాని అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ప్రస్తుత పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది.పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ను గద్దె దించేందుకు ఓటింగ్‌కు ముందే అధికారిక పార్టీ మిత్రపక్షం కూటమి నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. మరోవైపు పాక్‌ నేషనల్‌ అసెంబ్లీలో ఇమ్రాన్‌ ఖాన్‌ మెజారిటీ కోల్పోవడంతో రాజీనామా చేయాలంటూ ఆయనపై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో షెహబాజ్‌ షరీఫ్‌ త్వరలో ప్రధానమంత్రి అవుతారని పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ ఛైర్మన్‌ బిలావల్‌ భుట్టో జర్దారీ చెప్పారు.

 

 

 

 

కాగా, మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ సోదరుడైన షెహబాజ్‌ 2018 ఆగస్టు నుండి నేషనల్‌ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. ఆయన 1988లో పంజాబ్‌ ప్రావిన్షియల్‌ అసెంబ్లీకి, 1990లో నేషనల్‌ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1993లో మరోసారి పంజాబ్‌ అసెంబ్లీకి షెహబాజ్‌ ఎన్నికై ప్రతిపక్ష నాయకుడయ్యారు. 1997లో ఆయన మొదటిసారి ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1999లో సైనిక తిరుగుబాటుతో జాతీయ ప్రభుత్వాన్ని తొలగించిన తర్వాత షెహబాజ్‌ తన కుటుంబంతో సహా సౌదీ అరేబియాలో ప్రవాసంలో ఉన్నారు. 2007లో పాకిస్తాన్‌కు తిరిగి వచ్చారు. పిఎంల్‌ఎన్‌ విజయం అనంతరం షెహబాజ్‌ రెండోసారి పంజాబ్‌ ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. ఆయన సోదరుడైన నవాజ్‌ షరీఫ్‌ పదవికి అనర్హుడయిన తర్వాత షెహబాజ్‌ పిఎంఎల్‌ఎన్‌ అధ్యక్షుడిగా నామినేట్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news