చర్మం పొడిబారడం, కొత్త కణాలు ఏర్పడకపోవడం, సూర్యరశ్మి, చలిగాలులు, పొగతాగడం, వ్యాయామం లేకపోవడం మొదలైనవన్నీ చర్మ వయసును పెంచుతాయి. తద్వార ఎక్కువ వయసున్న వారిలాగా కనిపిస్తారు. అందుకే చర్మం పట్ల జాగ్రత్త చాలా అవసరం. మరి ఇలాంటి పరిస్థితుల నుండి బయటపడడానికి కొన్ని ఫేస్ ప్యాక్స్ పనిచేస్తాయుఇ. అవేంటో ఇక్కడ చూద్దాం.
తేనె ప్యాక్
తేనె కారణంగా చర్మంపై తేమ కలుగుతుంది. అలాగే చర్మ కణాలు ఉత్పత్తి అవుతాయి. దీనికోసం మీరు కొద్దిగా తేనె తీసుకుని అందులో 2-3కుంకుమ పువ్వులను కలపండి. ఆ తర్వాత మెడ భాగం నుండి ముఖం వరకు బాగా మర్దన చేయాలి. 15-20నిమిషాలు అలాగే ఉంచాక నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఇలా ప్రతీరోజూ చేస్తే మంచి ఫలితం దక్కుతుంది.
పెరుగు ప్యాక్
పెరుగులో విటమిన్లు, ఖనిజాలు, ఎంజైములు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని తేమగా ఉంచడంలో సాయపడతాయి. పెరుగులో ఉండే లాక్టిక్ ఆమ్లం కారణంగా చనిపోయిన చర్మ కణాలు తొలగిపోయి కొత్త కణాలు పుట్టుకొస్తాయి. మఉడుతలను, గీతలను తగ్గించడంలో పెరుగు చాలా ఉపయోగపడుతుంది.
దీన్ని తయారు చేసుకోవాలంటే
2టేబుల్ స్పూన్ల పెరుగును తీసుకుని కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా తేనె, పసుపు కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ముఖానికి మర్దన చేయాలి. 15నిమిషాల తర్వాత ముఖం కడుక్కుంటే సరిపోతుంది.
తులసి ఫేస్ ప్యాక్
తులసి ఆకులను తీసుకుని వాటిని నలగగొట్టి నీటితో కలుపుకుని ముఖానికి వర్తించాలి. వారానికి రెండు నుండి మూడుసార్లు చేస్తే చాలు, చక్కటి మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది.