Ori Devuda: విశ్వక్ సేన్ ‘ఓరి దేవుడా’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోలలో విశ్వక్ సేన్ కూడా ఒకరు. తాజాగా ఈ హీరో నటిస్తున్న చిత్రం ఓరి దేవుడా.. ఈ సినిమాలో హీరో వెంకటేష్ కూడా కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు.

దీంతో ఈ సినిమా పైన తెలుగు ప్రేక్షకులకు మరింత ఆసక్తి నెలకొంది అని చెప్పవచ్చు. ఈ సినిమాలో వెంకటేష్ గెస్ట్ రోల్ కి మించిన పాత్ర చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, పాటలు సినిమాపై అంచనాలు పెంచేశాయి.

ఇక తాజాగా ఈ సినిమా నుంచి బిగ్‌ అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమా రిలీజ్ డేట్‌ ను తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. అక్టోబర్‌ 21 న అంటే దీపావళి కానుకగా ఈ సినిమా ను రిలీజ్‌ చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటన చేసింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ ను కూడా రిలీజ్‌ చేసింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version