కారులో సొంత పోరు..ఖమ్మంలో మళ్ళీ రివర్సే?

-

అధికార టీఆర్ఎస్ లో రోజురోజుకూ ఆధిపత్య పోరు పెరిగిపోతుంది…పార్టీలో ఉన్న నేతలు ఎవరికి వారే పెత్తనం చెలాయించాలనే క్రమంలో..రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లో పోరు పెరుగుతుంది…ఇప్పటికే రెండోసారి అధికారంలో కొనసాగుతుంది..పైగా ఇతర పార్టీల నుంచి నేతల తాకిడి ఎక్కువైంది..దీని వల్ల మరింతగా పార్టీపై ప్రభావం పడింది. 2014లో గెలిచి అధికారంలోకి వచ్చినప్పుడు ఇతర పార్టీ నేతలు ఎక్కువగానే వచ్చారు. అయితే అప్పుడు టీఆర్ఎస్ లో నేతల కొరత ఉంది..దాని వల్ల ఇతర పార్టీల నుంచి నేతల రావడం అడ్వాంటేజ్ అయింది.

TRS-Party | టీఆర్ఎస్
TRS-Party | టీఆర్ఎస్

అయితే 2018లో గెలిచి రెండో సారి అధికారంలోకి వచ్చాక కూడా వలసలు జరిగాయి..ఇక పార్టీలో నేతలు ఫుల్ గా ఉన్నా సరే..ఇతర పార్టీల నేతలని తీసుకొచ్చారు. దీని వల్ల పార్టీలో మరింత రచ్చ పెరిగింది. ఇక ఈ పోరు రోజురోజుకూ పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు..ఇప్పటికే ప్రతి జిల్లాలోనూ ఆధిపత్య పోరు ఉంది. ఇక టీఆర్ఎస్ పార్టీకి ఏ మాత్రం అనుకూలంగా లేని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సైతం నేతల మధ్య ఆధిపత్య పోరు ఎక్కువ ఉంది.

ప్రతి నియోజకవర్గంలోనూ వలస వచ్చిన ఎమ్మెల్యేకు, టీఆర్ఎస్ లో ఉన్న నేతలకు పడటం లేదు. పాలేరులో ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి…మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మధ్య పోరు ఏ విధంగా నడుస్తుందో అందరికీ తెలిసిందే. పాలేరు సీటు కోసం ఇద్దరు నేతలు గట్టిగానే ట్రై చేస్తున్నారు. అటు కొత్తగూడెంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావుకు పడటంలేదు.

అటు సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు, పిడమర్తి రవిల మధ్య పోరు ఉంది. వైరా ఎమ్మెల్యే ఎల్‌.రాములు, మాజీ ఎమ్మెల్యే బాణోతు మదన్‌లాల్‌ ఎవరికి వారుగా రాజకీయం చేస్తున్నారు. పినపాకలో ఎమ్మెల్యే రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ఇలా ఖమ్మంలో ఆధిపత్య పోరు ఎక్కువగా ఉంది..ఈ పోరే మళ్ళీ ఖమ్మంలో టీఆర్ఎస్ విజయాన్ని దూరం చేసేలా ఉంది…గత రెండు ఎన్నికల్లో ఖమ్మంలో టీఆర్ఎస్ సత్తా చాటలేకపోయింది..ఈ పోరు వల్ల మళ్ళీ కారుకు డ్యామేజ్ అయ్యేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news