ఏపీలో దారుణం : 16 ఏళ్ల బాలికపై బాబాయి అత్యాచారం… !

-

ఏపీలోని తూ. గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. 16 ఏళ్ల బాలికపై సొంత బాబాయ్‌ ఆత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటన మూడు నెలల కింద చోటు చేసుకోగా… తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలిక పదో తరగతి పాస్‌ అయింది. ఆమె చిన్న తాత కుమారుడు (25) గత జూన్‌ లో ఒక రోజు ఇంట్లో ఎవరూ లేని సమయం లో ఆమె ఇంటికి వచ్చాడు. ఆమెకు ఓ కూల్ డ్రింక్‌ తీసుకువచ్చాడు.

బాబాయి తెచ్చిన కూల్‌ డ్రింక్‌ ను ఆ అమ్మాయి సంతోషంగా తాగింది. దీంతో వక్రబుద్దితో ఉన్న ఆ యువకుడు…ఆ బాలికపై ఆత్యాచారానికి ఒడిగట్టాడు. వరుసకు కూతురు అన్న విషయం మరిచి పోయి.. దారుణంగా వ్యవహరించాడు. ఆమెను నగ్నంగా ఫోటోలు మరియు వీడియోలు తీసి… బెదిరించాడు. ఎవరికైనా చెబితే ఆ ఫోటోలను సోషల్‌ మీడియా లో పెడతానని బెదిరించాడు. అయితే.. చివరికి ఆ టార్చర్‌ తట్టుకోలేక.. పేరేంట్స్‌ కు చెప్పింది ఆ బాలిక. దీంతో ఆ తల్లిదండ్రులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు ఆ యువకుడిపై కేసు నమోదు చేసి.. అరెస్ట్‌ చేశారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version