పాకిస్థాన్ ప్రధాన మంత్రిగా ఇటీవల ఎన్నికైన షెహబాజ్ షరీఫ్.. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. భారత్ తో పాక్ కూడా శాంతిని కోరుకుంటుందని లేఖలో తెలిపారు. ఇరు దేశాలు సహకార సంబంధాలతో ముందుకు వెళ్లాలని అని తెలిపారు. చర్చల ద్వారానే ఇరు దేశాల మధ్య ఉన్న సమస్యలు, పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. సామాజిక, ఆర్థిక అభివృద్ధి కోసం భారత్ – పాక్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ముఖ్యంగా ఇరు దేశాల మధ్య ప్రధాన సమస్యగా ఉన్న కశ్మీర్ అంశాన్ని పరిష్కారం అయ్యేందుకు ఎప్పుడు ముందు ఉంటుందని లేఖ లో తెలిపారు. కాగ ఇటీవల షెహబాజ్ షరీఫ్.. పాకిస్థాన్ ప్రధాన మంత్రిగా ఎన్నిక అయ్యాక.. భారత ప్రధాని మోడీ లేఖ రాశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని, చర్చల కోసం ఉగ్రవాద రహిత వాతావరణాన్నిసృష్టించాలని లేఖ లో పీఎం మోడీ పేర్కొన్నారు. ఇదిల ఉండగా.. పాక్ పీఎం షెహబాజ్ షరీఫ్ ప్రమాణస్వీరణ సమయంలో కాశ్మీర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.