AIADMK చీఫ్​గా ప‌ళ‌నిస్వామి ఎన్నికే సరైనది : సుప్రీం కోర్టు

-

తమిళనాడు మాజీ సీఎం పన్నీరు సెల్వంకు సుప్రీంకోర్టు షాక్‌ ఇచ్చింది. ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నేట్ర ఖ‌జ‌గం(ఏఐఏడీఎంకే) పార్టీ చీఫ్ ఎవ‌ర్న‌దానిపై సుప్రీం కోర్టు క్లారిటీ ఇచ్చింది. ఏఐఏడీఎంకే జనరల్‌ సెక్రటరీగా పళనిస్వామి ఎన్నిక సరైనదేనని స్పష్టం చేసింది. ప‌న్నీరుసెల్వం పెట్టుకున్న అభ్య‌ర్థ‌న‌ను తోసిపుచ్చింది. జ‌స్టిస్‌ దినేశ్ మ‌హేశ్వ‌రి నేతృత్వంలోని బెంచ్ ఈ తీర్పును వెల్ల‌డించింది. గ‌తేడాది జులై 11న జ‌రిగిన పార్టీ స‌మావేశాల స‌మ‌యంలో రూపొందించిన స‌వ‌ర‌ణ‌ల ఆధారంగా ధ‌ర్మాస‌నం తీర్పును వెలువ‌రించింది.

ఈపీఎస్‌కు సుప్రీంకోర్టు ప‌చ్చ‌జెండా ఊప‌డంతో.. చెన్నైలోని అన్నాడీఎంకే ప్ర‌ధాన కార్యాల‌యం వ‌ద్ద సంబ‌ురాలు మొద‌ల‌య్యాయి. ప‌ళ‌నిస్వామి మ‌ద్ద‌తుదారులు ర్యాలీ నిర్వహించి మిఠాయిలు పంపిణీ చేశారు. ప్ర‌స్తుతం అన్నాడీఎంకే తాత్కాలిక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప‌ళ‌నిస్వామి కొన‌సాగుతున్నారు. ఇక నుంచి ఆ బాధ్య‌త‌ల్లో ఆయ‌నే ఉండ‌నున్నారు. మ‌ద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం స‌మ‌ర్ధించింది.

Read more RELATED
Recommended to you

Latest news