అధికార, ధన బలంతో ఉప ఎన్నికలు గెలవాలనుకుంటున్నారు : పాల్వాయి స్రవంతి

-

మునుగోడు ఉప ఎన్నికకు సమయం దగ్గరపుడుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి. అయితే ఈ నేపథ్యంలోనే నేడు సీఎం కేసీఆర్‌ మునుగోడు నియోజకవర్గంలోని చండూరులో టీఆర్‌ఎస్‌ పార్టీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తూ.. బీజేపీ, కాంగ్రెస్‌లపై విమర్శలు గుప్పించారు. అయితే.. తాజాగా హైదరాబాద్ మన్నెగూడలోని వేదా కన్వెన్షన్ హాల్లో మునుగోడు నియోజకవర్గ ఓటర్ల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి పాల్గొని మాట్లాడుతూ.. టీఆర్ఎస్, బీజేపీలు అధికార, ధన బలంతో ఉప ఎన్నికలు గెలవాలనుకుంటున్నాయని పాల్వాయి స్రవంతి మండిపడ్డారు.

మునుగోడులో దూకుడు పెంచిన కాంగ్రెస్.. పాల్వాయి స్రవంతి ప్రచారపర్వం;  కాంగ్రెస్ సక్సెస్ అవుతుందా? | Congress steps up Munugode campaigan.. Palvai  Sravanthi in villages; Will ...

ఆత్మాభిమానం పేరుతో మునుగోడు ప్రజలను మోసం చేయాలనుకుంటున్నారని స్రవంతి విమర్శించారు. టీఆర్ఎస్ అభ్యర్థి ఎక్కడున్నాడో..ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాని పరిస్థితి ఉందన్నారు. అభివృద్ధి చేశామంటున్న టీఆర్ఎస్ నేతలు.. ఎందుకు కౌరవ సైన్యాన్ని దించారని ప్రశ్నించారు పాల్వాయి స్రవంతి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు పాల్వాయి స్రవంతి.

Read more RELATED
Recommended to you

Latest news