పాన్‌కార్డ్‌ దారులు వెయ్యి రూపాయిలు ఆదా చేసుకునే అవకాశం..!

-

మీకు పాన్ కార్డు వుందా..? అయితే మీకు గుడ్ న్యూస్. పాన్ కార్డు వున్నవాళ్లు 1000 రూపాయలు ఆదా చేయవచ్చు. అది ఎలా అంటే పాన్ కార్డ్, ఆధార్ లింక్ చేయమని ప్రభుత్వం ఎప్పటి నుండో చెబుతోంది. గతంలో 31 డిసెంబర్ 2021ని చివరితేదీగా నిర్ణయించింది. అయితే ఆ తేదీలోగా లింక్ చేసుకోనట్టయితే అప్పుడు వారికి రూ.1000 జరిమానా విధిస్తామని అంది.

అలానే ఈ రెండిటినీ లింక్ చెయ్యకపోతే ఇతర సమస్యలు కూడా వచ్చే అవకాశం వుంది. అందుకే నివారించాలనుకుంటే వెంటనే పాన్, ఆధార్ కార్డును లింక్ చేయండి. అయితే గడువుని 31 మార్చి 2022గా నిర్ణయించారు. అందుకని అప్పటిలోగా లింక్ చేసుకుంటే వెయ్యి రూపాయిలు వరకు సేవ్ అవుతాయి. ఆధార్‌, పాన్‌ కార్డులను లింక్‌ చేయని వారిపై జరిమానా విధించేలా బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రత్యేక నిబంధన తీసుకొచ్చింది.

దీనికి గత సంవత్సరం బడ్జెట్‌లో ప్రభుత్వం ఆర్థిక బిల్లును ఆమోదించింది. పాన్ కార్డ్, ఆధార్ లింక్ చేసుకోని వారు రూ.1000 జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఫైనాన్స్ బిల్లులో ఓ రూల్ ని పెట్టారు. దీనికి ఆదాయపు పన్ను చట్టంలో కొత్త సెక్షన్ 234హెచ్‌ని చేర్చారు. ఒకవేళ ఎవరైనా లింక్ చేసుకోక పోయినట్లయితే జరిమానాగా మొత్తం రికవర్ చేస్తారు.

అది గరిష్టంగా 1000 రూపాయల వరకు ఉంటుంది. కనుక అనవసరంగా లింక్ చేసుకోవడం మానేయద్దు. సులభంగా ఈ రెండిటినీ లింక్ చేసుకోచ్చు కనుక అలా చేసేయడమే మంచిది. లింక్ చెయ్యకపోతే జరిమానా ఏ కాదు అనేక రకాల ఆర్థిక సమస్యలని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version