పాన్ కార్డు పైన ప్రభుత్వం కీలక నిర్ణయం.. వాళ్ళు రూ.1,000 కట్టాల్సిందే..!

-

భారత ప్రభుత్వంలోని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదాయపు పన్ను శాఖ కొత్త మార్గదర్శకాన్ని జారీ చేసింది. ఇక మరి వాటి కోసం తెలుసుకుందాం. మనకి వుండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో పాన్ కార్డు కూడా ఒకటి. పాన్ కార్డు చాలా వాటికి అవసరం. పాన్ మరియు ఆధార్ లింక్ చేయడానికి గడువు జూన్ 30న నిర్ణయించబడింది. అయితే పాన్ ని ఆధార్ తో లింక్ చేయడం తప్పని సరి. పొడిగించిన పరిమితి ప్రకారం పాన్ ఆధార్ లింక్ చివరి రోజు 30 జూన్ 2023. పాన్ మరియు ఆధార్ లింక్ చేసేటప్పుడు కచ్చితంగా ఈ ముఖ్యమైన విషయం ఒకటి ఉంది.

ఒకవేళ కనుక పాన్ ఆధార్ లింక్ చేసుకోక పోతే లింక్ చెయ్యని వారు రూ.1000 పెనాల్టీగా చెల్లించాల్సి ఉంటుంది. పాన్ కార్డు వున్నవాళ్లు ఆధార్ తో లింక్ చేసుకోకపోతే ఇప్పుడు లింక్ చేసుకోవచ్చు. 1000 రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక పాన్ కార్డు ని ఆధార్ కార్డు తో గడువు లోగా లింక్ చేసుకోక పోతే పాన్ కార్డ్ రద్దు చేయబడుతుంది. ఆధార్ కార్డు పాన్ కార్డు లింక్ చేయాలంటే మీరు 1000 రూపాయలు చెల్లించి ఆన్‌లైన్‌లో పాన్ ఆధార్‌ను లింక్ చేసుకోవచ్చు.

ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి పాన్ ఆధార్‌ను లింక్ చెయ్యచ్చు. https://www.incometax.gov.in/iec/foportal/ లోకి వెళ్లి పాన్ ఆధార్‌ను లింక్ చెయ్యచ్చు. ఈ వెబ్ సైట్ కి వెళ్లి లాగిన్ అవ్వాలి. అకౌంట్ లేకపోతే అకౌంట్ క్రియేట్ చేసి లాగిన్ అవ్వాలి. యూజర్ ఐడీ తప్పనిసరిగా లాగిన్ అప్పుడు ఇవ్వాలి. utiitsl.com లేదా egov-nsdl.co.in ప్రభుత్వ వెబ్‌సైట్ ద్వారా కూడా చేయవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version