రాజకీయాల్లో వ్యూహాలు, ప్రతి వ్యూహాలు కామన్ అని చెప్పొచ్చు…ప్రత్యర్ధులకు చెక్ పెట్టడానికి పార్టీలు ఎప్పటికప్పుడు కొత్త పంథాలో రాజకీయ వ్యూహాలు వేస్తూ ఉంటాయి. అయితే ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ ఇచ్చాక రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి…పీకే టీం ఏపీలో జగన్ కోసం, తెలంగాణలో కేసీఆర్ కోసం పనిచేస్తున్న విషయం తెలిసిందే.
అయితే పీకే టీం పాలిటిక్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి…ప్రత్యర్ధులకు చెక్ పెట్టడానికి ఫేక్ పాలిటిక్స్ నడపటంలో పీకే టీం టాప్ లో ఉందని చెప్పొచ్చు. అసలు లేని దాన్ని ఉన్నట్లు సృష్టించి ప్రత్యర్ధులని నెగిటివ్ చేయడంలో పీకే టీం బాగా పనిచేస్తుంది. అలాగే కులాల మధ్య చిచ్చు లేపడంలో కూడా ముందే ఉంటుందని విమర్శలు వస్తున్నాయి. ఇదే క్రమంలో ఏపీలో టీడీపీ-జనసేనల మధ్య చిచ్చు లేపే విధంగా పీకే టీం పనిచేస్తుందని తెలుస్తోంది.
2019 ఎన్నికల ముందే పీకే టీం…టీడీపీ-జనసేనల మధ్య చిచ్చు పెట్టిందని చెప్పొచ్చు. సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తల పేరుతో ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి పవన్ ని తిట్టించడం, అలాగే జనసేన కార్యకర్తల పేరుతో ఫేక్ ఐడీ క్రియేట్ చేసి చంద్రబాబుని తిట్టించడం లాంటివి చేసి..టీడీపీ-జనసేనల మధ్య గొడవ పెట్టి, మధ్యలో వైసీపీ లబ్ది పొందేలా చేశారనే విమర్శలు ఉన్నాయి.
ఇప్పుడు కూడా పీకే టీం అదే పనిలో ఉందని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఇటీవల దేవినేని ఉమా పేరిట నకిలీ పోస్టు పెట్టారు…ఆ పోస్టులో ఉమా…పవన్ పై విమర్శలు చేసినట్లు ఉంది. తీరా చూస్తే ఆ పోస్టు తనది కాదని ఉమా చెప్పడమే కాదు…ఏకంగా సిఐడికి ఫిర్యాదు చేశారు. అలాగే టీడీపీ నేత కూన రవికుమార్ పేరిట నకిలీ సోషల్ మీడియా ఖాతా సృష్టించి..పవన్ ని తిడుతున్నట్లు పోస్ట్ పెట్టారు. అలాగే వాలంటీర్లు, సచివాలయ సిబ్బందిని తాము అధికారంలోకి వస్తే తొలగిస్తామని అచ్చెన్నాయుడు పేరిట ఓ నకిలీ లెటర్ బయటకొచ్చింది. ఇదంతా పీకే టీం సృష్టి అని, కాబట్టి టీడీపీ, జనసేన శ్రేణులు అలెర్ట్ గా ఉండాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. అలెర్ట్ గా లేకపోతే మళ్ళీ టీడీపీ-జనసేనల మధ్య పంచాయితీ పెరుగుతుందని అంటున్నారు.