డబ్బు ఆశ లేని వ్యక్తి అనేవారు ఉండరు..అందరికి డబ్బులు సంపాదించాలని అనుకుంటారు..ఒక్కొక్కరికి ఒక్కో ఆలోచన ఉంటుంది..కొన్ని డబ్బులు వస్తే మరి కొన్ని మాత్రం జైలు పాలు చేస్తున్నాయి..డబ్బుల సంపాదించిన వారికన్నా కూడా పోగొట్టుకున్న వారి సంఖ్య రోజు రోజుకు ఎక్కువ అవుతుంది..తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది.. పందుల పెంపకం పేరుతో వేలమంది నుంచి పెట్టుబడులు స్వీకరించి మోసం చేశారు. పది వేల రూపాయలు పెట్టుబడి పెడితే మూడు పందిపిల్లలు వస్తాయని, ఏడు నెలల్లో ఆ డబ్బులు 1.5 రెట్లు పెరుగతాయని నమ్మించి పెట్టబడులు స్వీకరించారు. ఏడాది గడుస్తున్నా.. తమ డబ్బులు తమకు ఇవ్వకపోవడంతో చివరికి మోసపోయామని తెలుసుకుని వారంతా పోలీసులను ఆశ్రయించారు..
ఫోన్ నెంబర్స్ నుంచి కొన్ని ఫ్రాడ్ కాల్స్ వస్తున్నాయి.. వెయ్యి రూపాయిలు పెట్టుబడి పెడితే మీ డబ్బులు మరుసటి రోజు రెట్టింపు అవుతాయంటూ డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈజీగా డబ్బులు సంపాదించాలని ఆలోచిస్తున్న వారిని టార్గెట్ చేస్తున్నారు.మీ డబ్బులను తాము షేర్ మార్కెట్ లో పెడతామని, ఆ డబ్బులు 24 గంటల్లో రెట్టింపు చేసి ఇస్తామని నమ్మిస్తున్నారు.. సులువుగా నగదు సంపాదించాలనే కోరికలతో జనాలు కూడా ఇలాంటి వాటికి ఆకర్షితులు అవుతున్నారు..
ఇలా ఈజీగా నగదు సంపాదించుకోవచ్చంటూ వస్తున్న స్కీమ్‌లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎవరైనా తెలియని వ్యక్తులు ఇలాంటి మాటలు చెప్పి.. డబ్బులు డిపాజిట్ చేయమని అడిగితే వెంటనే సమీప పోలీసులకు తెలియజేయాలంటున్నారు. మీ డబ్బులు తక్కువ కాలంలో డబుల్ అవుతాయని ఎవరైనా చెప్తే అది సాధ్యం కాని పనని ఎవరూ అలాంటి వాటిని అస్సలు నమ్మొద్దని వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు..