ఎప్పుడైతే ధర్మవరం సీటు విషయంలో రచ్చ మొదలైందో..అప్పటినుంచి పరిటాల శ్రీరామ్ మరింత దూకుడుగా రాజకీయం చేయడం మొదలుపెట్టారు..నిత్యం ఆయన ప్రజల్లో ఉంటూ, సమస్యలపై పోరాటాలు చేస్తున్నారు. అయితే తాజాగా ధర్మవరం రెవెన్యూ డివిజన్‌పై పోరాటం మొదలుపెట్టారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం జిల్లాల విభజన చేసిన విషయం తెలిసిందే..ఈ క్రమంలోనే ధర్మవరం రెవెన్యూ డివిజన్‌ని రద్దు చేసి..పుట్టపర్తి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశారు.
అయితే ఎప్పటినుంచో ఉన్న ధర్మవరం రెవెన్యూ డివిజన్‌ని రద్దు చేయడంపై పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ధర్మవరం రెవెన్యూ డివిజన్‌ని కొనసాగించాలని చెప్పి.. టీడీపీ నేతలు పోరాటాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పరిటాల శ్రీరామ్.. ధర్మవరం రెవెన్యూ డివిజన్ కోసం ఒకరోజు నిరాహార దీక్ష కూడా చేశారు. అలాగే ధర్మవరం తహశీల్దార్ కార్యలయం దగ్గర ఆందోళన చేపట్టారు. ఇదే సమయంలో మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ సైతం.. ధర్మవరం రెవెన్యూ డివిజన్ కొనసాగించాలని చెప్పి… అనంతపురం కలెక్టర్‌ని వినతిపత్రం ఇచ్చారు.
ఇలా ఇద్దరు నేతలు రెవెన్యూ డివిజన్ కోసం పోరాటం చేస్తున్నారు..అయితే ఈ ఇద్దరు నేతలు ధర్మవరం సీటు కోసం పోటీ పడుతున్న విషయం తెలిసిందే. అసలు 2014లో గోనుగుంట్ల టీడీపీ నుంచి ధర్మవరం ఎమ్మెల్యేగా గెలిచారు..ఇక 2019 ఎన్నికల్లో ఓడిపోయాక ఆయన బీజేపీలోకి వెళ్ళిపోయారు. దీంతో ధర్మవరం బాధ్యతలు పరిటాల శ్రీరామ్ చూసుకుంటున్నారు..ఇక సీటు కూడా తనదే అని శ్రీరామ్ అంటున్నారు.
ఇదే సమయంలో ఆ మధ్య ధర్మవరం టీడీపీ సీటు..గోనుగుంట్లదే అని ఆయన అనుచరులు మాట్లాడారు..దీనిపై శ్రీరామ్ ఫైర్ అయ్యి..పార్టీలోకి ఎవరొచ్చినా..ధర్మవరం సీటు మాత్రం తనదే అని మాట్లాడారు. అయితే ధర్మవరం సీటు విషయంలో చంద్రబాబు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ సీటు కోసం ఇద్దరు నేతలు మధ్య గట్టి పోటీ నెలకొంది..ఈ క్రమంలోనే ఇద్దరు నేతలు ధర్మవరం రెవెన్యూ డివిజన్ కోసం పోరాటం మొదలుపెట్టిన కనిపిస్తోంది. ఏదేమైనా సీటు విషయంలో శ్రీరామ్ ఎక్కడా తగ్గేలా లేరు.