డిసెంబర్‌ 4 నుంచి శీతాకాల పార్లమెంట్‌ సమావేశాలు

-

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల షెడ్యూల్‌ ఖరారైంది. ఈ మేరకు నవంబర్ 9వ తేదీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది కేంద్రం. 2023, డిసెంబర్ 4వ తేదీ నుంచి 22వ తేదీ వరకు మొత్తం 19 రోజులు జరగనున్నట్లు స్పష్టం చేసింది కేంద్రం. 19 రోజుల్లో.. 15 సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్లమెంట్ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. డిసెంబర్ 3వ తేదీన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ఈ రిజల్ట్స్ వచ్చిన తెల్లారే పార్లమెంట్ సెషన్స్ స్టార్ట్ కావటం ఆసక్తికరంగా మారింది.

ఈ శీతాకాల సమావేశాల్లో కీలకమైన బిల్లులు చర్చకు రానున్నట్లు సమాచారం. వన్ నేషన్.. వన్ ఎలక్షన్ బిల్లుపై చర్చ జరిగే అవకాశాలు లేకపోలేదు. వాస్తవానికి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రతి ఏడాది నవంబర్‌ మూడో వారంలో ప్రారంభమై క్రిస్మస్‌ పండుగకు ముందు ముగుస్తాయి. కానీ, ఈసారి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆలస్యంగా పార్లమెంట్‌ వింటర్‌ సెషన్‌ మొదలవుతున్నది. ఎప్పటిలాగే క్రిస్మస్‌ పండుగకు ముందు సెషన్‌ ముగియనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version