నిద్రపోయే సమయంలో కలలు రావడం అనేది కామన్ విషయమే..అయితే ఈ కలలో వచ్చే వాటికి..మన భవిష్యత్తకు ఏదో సంబంధం ఉందని, ముందే ఇలా చెప్పే ప్రయత్నం చేస్తున్నాయని పండితులు అంటుంటారు. కొన్నిసార్లు కలలో ఏం జరిగిందో లేచిన తర్వాత గుర్తుతెచ్చుకోవడానికి చాలా ప్రయత్నిస్తాం.అయినా గుర్తుకురాదు..మరికొన్నిసార్లు కలలో మనుషులు, జంతువులు, పక్షులు, ఎత్తయిన శిఖరాలు, జలపాతాలు, లోయలు ఇలా ఎన్నో కనిపిస్తాయి. అయితే కలలోకి కొన్ని రకాల పక్షులు వస్తే అదృష్టం, సంతోషం.. కొన్ని జాతుల పక్షులు కనిపిస్తే సమస్యలు ఎదురవుతాయని పండితులు అంటారు. ముఖ్యంగా రామచిలుకలు కలలోకి వస్తే ఆ మనిషి పంట పండినట్టేనట.
ఇలా జరగడం వల్ల వ్యాపార రంగాల్లో గుర్తింపు, గౌరవంతో పాటు ఆకస్మిక ధనలాభం, అధిక మొత్తంలో లాభాలు వస్తాయట. కాబట్టి కలలో రామచిలుకలు కనిపించడం శుభసూచకమేనని చాలామంది విశ్వసిస్తారు. అలాగే, పిచ్చుకలు, నెమలి, గరుడ పక్షి, కొంగ కనిపించడం కూడా శుభ సూచికమేనట..ఈ పక్షులు కలలోకి వస్తే.. కష్టాలు తొలగిపోయి కుటుంబాల్లో ఆనందాలు నెలకొనడంతో పాటు సంపద వృద్ధి, వివాహం, సంతానప్రాప్తి కలుగుతాయట.
కలలో కాకి కనిపిస్తే మాత్రం దురదృష్టమని.. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా సమస్యలు ఎదురయ్యే ప్రమాదముందని అంటుంటారు.
కలలో చిన్నపిల్లల నవ్వులు వినిపిస్తాయి. అది దేనికి సంకేతం అంటే..
చిన్నపిల్లలు కలలో కనిపించడం అనేది… మీ స్వచ్ఛమైన హృదయాన్ని ప్రతిబింబించడం లాంటిది. ‘పిల్లలు’ స్వచ్ఛత, అమాయకత్వం, మంచితనం… తదితర లక్షణాలకు ప్రతీకలాంటివారు. కలలో… చిన్న పిల్లలు మిమ్మల్ని చూసి నవ్వుతున్నారంటే…మీరు మది నిండా సంతోషంగా ఉన్నారని అర్థం. కలలో పిల్లలు కనిపించడం అనేది, మీలో మీకు కనిపించని శక్తులు…మిమ్మల్ని పలకరించడం కూడా.
ఏ పని నేను చేయలేను అని ఎలాంటి ప్రయత్నం లేకుండానే ఓటమికి సిద్ధపడతారు కొందరు. నిజానికి, ప్రయత్నిస్తే తేలికగా విజయం సాధించే సామర్థ్యాలు వారిలో ఉంటాయి. సన్నిహితులు సపోర్ట్ ఇచ్చినా..పెద్దగా పట్టించుకోరు.అలా అని మానసికంగా ప్రశాంతంగా కూడా ఉండరు. లేనిపోని భయాలను ఊహించుకుంటున్నాను’’ అని మనసులో మథనపడుతున్నప్పుడు…ఈ ఆలోచనే కలగా వస్తుంది. ఆ కలలో పిల్లలు కనిపించడం, మనలోని సామర్థ్యాన్ని ప్రతిబింబించడం లాంటిది. పిల్లలు కలలో కనిపించడం అనేది… ఒక కొత్త ప్రారంభాన్ని కూడా సూచిస్తుంది. ‘నేను అలా కాదు. ఇలా ఉండాలనుకుంటున్నాను’ అని ఒక నిర్ణయానికి బలంగా వచ్చినప్పుడు, ఆ నిర్ణయం పిల్లల నవ్వుల రూపంలో కలలో ప్రతిఫలిస్తుంది.
-Triveni Buskarowthu