ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. రాజ్యాంగ విరుద్ధంగా పాలన సాగిస్తూ ప్రజలను తీవ్రంగా బాధిస్తున్నారు అంటూ మండిపడ్డారు టిడిపి నేత మాజీ మంత్రి ఆలపాటి రాజా. మూడు రాజధానులు పేరుతో జగన్ సర్కార్ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది అంటూ విమర్శించారు. పాలన వికేంద్రీకరణ సీఆర్డీఏ బిల్లులకు ఆమోదం తెలపడం అనేది.. ముమ్మాటికీ రాజ్యాంగ విరుద్ధమే అంటూ వ్యాఖ్యానించిన ఆలపాటి రాజా… టీడీపీ అధినేత చంద్రబాబు సవాల్ విసిరితే వైసీపీ నుంచి అసలు స్పందనే లేదు అంటూ విమర్శించారు.
సీఎం జగన్ కి దమ్ము ధైర్యం ఉంటే వెంటనే ఎన్నికల ను రద్దు చేసి మళ్లీ ఉప ఎన్నికలకు వెళ్లాలి అంటూ డిమాండ్ చేసారు . జగన్ సర్కారు హయాంలో దళితులపై దాడులు పెరిగిపోయాయని … ప్రభుత్వానికి ఎదురు తిరిగిన వారిపై అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారు అంటూ విమర్శించారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రజల మనిషి అని ప్రజల కోసం పోరాడే వ్యక్తి అని ఆయన వ్యాఖ్యానించారు,