పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోలలో ఒకరిగా పేరు పొందారు. ఒక్కో చిత్రానికి దాదాపుగా పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ రూ.50 కోట్ల రూపాయల వరకు అందుకుంటున్నారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ కొత్త కార్లను కొనుగోలు చేయడం జరిగింది. ఈ కొత్త కార్లు కోసం పవన్ కళ్యాణ్ ఏకంగా కోటిన్నర రూపాయలు ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది.
ఒక కారు విలువ దాదాపు గా రూ.20 లక్షల రూపాయలతో అటూఇటుగా ఉంటుందట. జనసేన పార్టీ కోసం పవన్ కళ్యాణ్ ఈ కార్లను కొనుగోలు చేసినట్లుగా సమాచారం అందుతోంది. పవన్ త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారని ప్రజల సమస్యలను తెలుసుకోవడం కోసం వారి యొక్క సమస్యలను పరిష్కరించే దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు సమాచారం. ఇప్పటికే పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన.. వీటిని 2023వ సంవత్సరం ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు సమాచారం.
పవన్ కళ్యాణ్ సీఎం కావాలని ఆయన అభిమానులు చాలా బలంగా కోరుకుంటున్నారు. టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకున్న పవన్ ని సీఎం చేస్తానని షరతు చెబితేనే కానీ పవన్ కళ్యాణ్ ఏ పార్టీకి సపోర్ట్ చేయనని తెలియజేసినట్లు సమాచారం. ఈ విషయంపై పవన్ అభిమానులు కూడా ఇదే అభిప్రాయాన్ని కోరుకుంటున్నారు. పవన్ 2024 ఎన్నికల్లో తిరుపతి నుంచి పోటీ చేసే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
తిరుపతిలో పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ కు అనుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నట్లుగా అభిమానులు భావిస్తున్నారు. హరిహర వీరమల్ల సినిమా పూర్తి చేసిన తర్వాత సినిమాలను మొదలుపెట్టి.. వాటిని పూర్తి చేసి.. ఆ తర్వాత కేవలం రాజకీయాల వైపు ఎక్కువ దృష్టి పెట్టాలని ఆలోచిస్తున్నట్లుగా పవన్ కళ్యాణ్ ఉన్నారట.