బాబు-పవన్ కాంబో…అక్కడ స్వీప్ చేస్తారా?

-

ఎవరు అవునన్న, కాదన్న..ఈ సారి ఎన్నికల్లో మాత్రం చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి పోటీ చేయడం ఖాయమని చెప్పొచ్చు…ఇందులో ఎలాంటి డౌట్ లేదనే చెప్పొచ్చు….ఎందుకంటే ఇప్పటికే వారు పరోక్షంగా పొత్తులకు రెడీ అయ్యారు..జగన్ ని ఓడించాలంటే తాము కలవక తప్పదని బాబు, పవన్ డిసైడ్ అయిపోయారు. ఒకవేళ విడిగా పోటీ చేస్తే ఓట్లు చీలిపోయి ఖచ్చితంగా జగన్ కు లబ్ది చేకూరుతుందనే విషయం బాబు, పవన్ లకు క్లియర్ గా అర్ధమవుతుంది.

ఇప్పటికే విడిగా పోటీ చేయడం వల్ల గత ఎన్నికల్లో ఇద్దరూ నష్టపోయారు…అయితే ఈ సారి మాత్రం ఆ తప్పు జరగకుండా చూసుకోవాలని అనుకుంటున్నారు…అందుకే పొత్తుకు రెడీ అవుతున్నారు. కాకపోతే పవన్, బీజేపీతో పొత్తులో ఉన్న విషయం తెలిసిందే…కానీ బీజేపీ…టీడీపీతో పొత్తు ఒప్పుకోవడం లేదు. కానీ వారిని ఎలాగైనా ఒప్పించి పొత్తుకు వెళ్తానని పవన్ చెబుతున్నారు. అంటే బాబుతో పొత్తుకు పవన్ రెడీ అయ్యారు…అటు బాబు సైతం పొత్తుకు సిద్ధంగా ఉన్నారు. ఇక ఎటు చూసుకున్న నెక్స్ట్ ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు ఫిక్స్ అని చెప్పొచ్చు…కలిస్తే బీజేపీ కలుస్తుంది లేదంటే లేదు.

అయితే టీడీపీ-జనసేన కలిస్తే కాస్త ఫలితాలు మారే అవకాశం ఉంది…వైసీపీకి డ్యామేజ్ జరిగే ఛాన్స్ ఉంది..అలాగే కొన్ని జిల్లాల్లో రెండు పార్టీలు మంచి ఫలితాలు సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. రెండు పార్టీలు కలిస్తే పశ్చిమ గోదావరిలో క్లీన్ స్వీప్ చేసే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది…ఎందుకంటే 2014లో పవన్ సపోర్ట్ చేయడం వల్ల…టీడీపీ-బీజేపీ కలిసి వెస్ట్ లో క్లీన్ స్వీప్ చేశాయి.

జిల్లాలో 15 సీట్లు ఉంటే టీడీపీ 14 సీట్లు గెలుచుకోగా, బీజేపీ ఒక సీటు గెలుచుకుంది. వైసీపీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. ఇక ఈ సారి టీడీపీ-జనసేన కలిస్తే వెస్ట్ లో మొత్తం సీట్లు గెలుచుకునే అవకాశాలు లేకపోలేదు..కాకపోతే బలంగా ఉన్న అధికార వైసీపీని దాటి స్వీప్ చేయడం సాధ్యమో కాదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news