పవన్ కల్యాణ్ స్థిరత్వం లేని వ్యక్తి : సీపీఐ నారాయణ

-

పవన్ కళ్యాణ్ నేషనల్ డెమొక్రటిక్ అలియన్స్ (ఎన్డీఏ) తో కలవడం బాధాకరమని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ వ్యాఖ్యానించారు. చేగువేరా నుండి సావర్కర్ వైపు పవన్ కళ్యాణ్ చేసిన ప్రయాణం శోచనీయమని అన్నారు. గతంలో విప్లవ వీరుడు చేగువేరా తరహాలో టీ షర్టులు వేసుకుని, సోషలిజం పైన గళం విప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మతవాద సంస్కరణల సావర్కార్ వైపు దారి తప్పి నడవడం సరికాదని అన్నారు. పవన్‌ కల్యాణ్‌ ఎన్డీయే మిత్రపక్ష కూటమి సమావేశానికి హాజరు అయినందున సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మంగళవారం స్పందించారు.

రేపు గాడ్సేలా తుపాకీ పట్టుకునేందుకు సిద్ధమవుతాడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్‌ కల్యాణ్‌ తీరు బాధాకరమన్నారు. రాజకీయాల్లో పవన్‌ కల్యాణ్‌ ఒక దళారీగా మారాడని అందుకే టీడీపీ-బీజేపీ మధ్య పొత్తుకోసం ప్రయత్నాలు చేస్తున్నాడని మండిపడ్డారు. ఈ మధ్యవర్తిత్వం పవన్ కల్యాణ్‌కు మంచిది కాదని విమర్శించారు. గతంలో పవన్ కల్యాణ్ ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలతో పోల్చాడని గుర్తు చేశారు. అసలు ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీతో ఎలా అంటకాగుతారు? అని పవన్ కల్యాణ్‌ను నిలదీశారు. పవన్ కల్యాణ్ బీజేపీతో కలవడం లౌకిక వాదానికి ప్రమాదకరమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version