Unstoppable : అన్ స్టాపబుల్ పవర్ స్టార్ ఎపిసోడ్ లో మరో గెస్టు సాయి ధరమ్ తేజ్..!

-

నందమూరి బాలకృష్ణ బుల్లితెరపై చేస్తున్న మ్యాజికల్ షో అన్ స్టాపబుల్. ఈ షో మొదటి సీజన్ కు వచ్చిన రెస్పాన్స్ తో ఆహా టీమ్ రెండో సీజన్ షురూ చేసింది. ఇక సెకండ్ సీజన్ కూడా క్రేజీ కాంబో గెస్టులతో ప్రతి ఎపిసోడ్ ప్రేక్షకులను అలరిస్తోంది.

ఇక ఈ షోకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురుచూస్తున్న అభిమానులకు ఆహా తాజాగా ప్రోమో రిలీజ్ చేసి సర్ ప్రైజ్ ఇచ్చింది. ఈ ప్రోమో రిలీజ్ అయిన నిమిషాల్లోనే లక్షల్లో వ్యూస్ సంపాదించింది. ప్రస్తుతం ట్రెండింగ్ లో కూడా ఉంది.

అయితే పవర్ స్టార్ ఎపిసోడ్ కు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటి వరకు దాదాపు ఈ షోకు సింగిల్ గా కాకుండా కాంబోగా గెస్టులు వచ్చారు. అయితే ఇప్పుడు పవర్ స్టార్ ఎపిసోడ్ లో కూడా అదే జరగబోతోందట. అయితే పవన్ తో ఎవరొస్తున్నారో తెలుసా.. ఇంకెవరు పవన్ కల్యాణ్ మేనల్లుడు సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్. దీనికి సంబంధించిన ఫొటో  ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే సాయిధరమ్ తేజ్ మాత్రం సింపుల్ గా పంచె కట్టుతో కనిపించడం విశేషం. పవన్ కల్యాణ్ తో తేజ్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. తమిళంలో సక్సెస్ అయిన వినోదయ సీతమ్ రీమేక్ లో వీళ్లిద్దరు కలిసి నటించబోతున్నట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే ఆ సినిమా కంటే ముందు ఈ మామా అల్లుళ్లు అన్ స్టాపబుల్ షోలో కలిసి కనిపించనున్నారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version