అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్లను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. పవన్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న వాలంటీర్లు సైతం నిరసనలకు దిగారు. పవన్ వెంటనే క్షమాపణ చెప్పాలంటూ నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలోనే తాజాగా ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ సైతం పవన్ చేసిన వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యింది.
ఇప్పుడు పవన్ వ్యాఖ్యలపై ఏపీ మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. ఈ మేరకు పవన్ కల్యాణ్‌కు నోటీసులు జారీ చేసింది మహిళా కమిషన్.. దీనిపై 10 రోజుల్లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. పవన్ వ్యాఖ్యలు ఒంటరి మహిళల గౌరవానికి భంగం కలించేలా ఉన్నాయని నోటీసుల్లో పేర్కొన్న కమిషన్.. తాను చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ ఆధారాలు ఇవ్వాలని డిమాండ్ చేసింది.
ఇక, మహిళలను ఉద్ధేశించి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ.. పవన్ వ్యాఖ్యలను తప్పుబడుతూ.. మహిళా సంఘాలు, వాలంటీర్లు ఈమెయిల్స్ ద్వారా ఫిర్యాదులు చేస్తున్నారని తెలిపారు.. అందుకే ఈ వ్యవహారంలో పవన్‌కు నోటీసులు జారీ చేస్తున్నట్లు వెల్లడించారు వాసిరెడ్డి పద్మ.