జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ హోం క్వారంటైన్‌లోకి వెళ్ళారు. పవన్ కల్యాణ్ ముఖ్యమైన కార్య నిర్వాహకులు, భద్రతా సిబ్బంది, వ్యక్తిగత సిబ్బందిలోని ఎక్కువ మంది కరోనా బారిన పడ్డారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా డాక్టర్ల సూచన మేరకు పవన్ కల్యాణ్ క్వారంటైన్ కు వెళ్లారు. ఈ మేరకు జనసేన పార్టీ సోషల్ మీడియా వేదికగా ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది.
గత వారం రోజులుగా ఆయన వద్ద పని చేసే సిబ్బంది ఒక్కొక్కరూ కరోనా బారినపడుతూ వస్తున్నారు. వీరంతా ఆయనకు చాలా సమీపంగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా, కరోనా విస్తృతి నివారణలో భాగంగా పవన్ కల్యాణ్ క్వారంటైన్ కు వెళ్ళినట్లు జనసేన పార్టీ తెలిపింది. పవన్ కల్యాణ్ రోజువారీ విధులు నిర్వహిస్తూనే పార్టీ కార్యక్రమాలను పరిశీలిస్తున్నారని అలానే టెలి కాన్ఫరెన్స్ ద్వారా పార్టీ నాయకులతో మాట్లాడుతున్నారని వెల్లడించింది. కాగా పవన్ కల్యాణ్ నటించిన చిత్రం వకీల్‌సాబ్ శుక్రవారం కిందట విడుదలైన సంగతి తెల్సిందే. ఈ చిత్రానికి అభిమానుల నుంచి మంచి స్పందన వస్తుంది. అలానే మంచి కలెక్షన్స్ కూడా వస్తున్నాయి.
Sri @PawanKalyan goes into quarantine pic.twitter.com/nBLrvxxYcc
— JanaSena Party (@JanaSenaParty) April 11, 2021