అందరూ కలిసి అమరావతి మా రాజధాని అని అందరూ ఒప్పుకున్నారని.. అప్పట్లో ప్రతిపక్షం ఇప్పడు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఒప్పుకుంటేనే అమరావతిని రాజధానిగా చేశారని పవన్ కళ్యాన్ అన్నారు. అధికారంలోకి రాగానే మూడు రాజధానులు అన్నారని… రాజులు మారినప్పుడు రాజధానులు మారవని.. ముఖ్యమంత్రి కాగానే పాలసీలు మారవని పవన్ కళ్యాన్ వైసీపీ, సీఎం జగన్ ను విమర్శించారు. మూడు రాజధానులు అని చెబుతున్న వాళ్లు రాజధాని ప్రకటించే రోజు గాడిదలు కాశారా..? అని ప్రశ్నించారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆ రోజు 34 వేల ఎకరాలు కాదని.. మరో 1000 ఎకరాలు అదనంగా ఇవ్వాలని కోరారని పవన్ గుర్తు చేశారు. మీ ఇష్టానికి ఏదైనా మారుస్తారా..? అడిగే వాడు లేకుంటే ఏదైనా చేస్తారా..? అంటూ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అమరావతి ఇక్కడ నుంచి కదలదని ఆయన హామీ ఇచ్చారు. న్యాయ వ్యవస్థను కూడా వైసీపీ తప్పు పట్టే స్థాయికి వెళ్లిందని విమర్శించారు.
రాజులు మారినప్పుడు రాజధానులు మారవు… ఆరోజు గాడిదలు కాశారా..? : పవన్ కళ్యాణ్
-