గజం భూమి కనిపిస్తే కబ్జా.. రాజ్యాంగ స్ఫూర్తిని పాటించరు.. గొంతెత్తితే లాఠీలతో కొడుతారు: వైసీపీపై పవన్ కళ్యాణ్ విమర్శలు

-

ఆంధ్ర ప్రదేశ్ మా సొంత భూమి, ఆంధ్రులంతా మా బానిసలు, రాజ్యాంగ స్ఫూర్తిని పాటించం, న్యాయవ్యవస్థను లెక్క చేయరు, ఉద్యోగులను పట్టిపీడిస్తాం, పోలీసులను మా ప్రైవేట్ ఆర్మీగా వాడేస్తాం, నిరుద్యోగులకు మొండి చేయి చూపిస్తాం అంటూ… వైసీపీ నేతలు, ప్రభుత్వం ప్రతిజ్జ్ఞ చేసిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. సహజంగా వచ్చే పెట్టుబడుల్లో 50 శాతం వాటా లాక్కుంటారని… అన్నంపెట్టే రైతన్నలకు అండగా ఉంటామని చెబుతాం, అధికారంలోకి రాగానే ఆత్మహత్యలను ప్రోత్సహిస్తారని… దేవతల విగ్రహాలను నాశనం చేసే వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారని.. సంపూర్ణ మద్యపాన నిషేధం పెట్టి తాగిస్తారని .. పార్కులు, స్కూళ్లు ప్రభుత్వ భవనాలను తాకట్టు పెడుతారని.. ఎవరైనా గొంతెత్తితే లాఠీలతో కొట్టిస్తారని, ఒక్క ఛాన్స్ ఇస్తే ఆంధ్రను 25 ఏళ్లు వెనక్కి తీసుకెళ్తారని, చిన్నా పెద్ద వ్యక్తుల ఆదాయ వనరులను దెబ్బకొడుతారని వైఎస్సార్సీపీ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు పవన్ కళ్యాణ్.

Read more RELATED
Recommended to you

Latest news