ఇంతకాలం అప్పుడప్పుడు మాత్రమే రాజకీయాలకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తూ..వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా గళం విప్పుతూ..ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్..ఇకపై వైసీపీపై యుద్ధం ప్రకటించారు. ఇప్పటివరకు వైసీపీ నేతలు బూతులు తిట్టిన, వాటికి తనదైన శైలిలో కౌంటర్లు ఇచ్చిన పవన్..ఇప్పటినుంచి వైసీపీకి వైసీపీకి బాషలోనే సమాధానం చెప్పాలని జనసేన శ్రేణులకు పిలుపునిచ్చారు.
వైసీపీ వారు రాడ్లు ఇచ్చుకుని వస్తే..తాము రాడ్లతో వస్తామని, బూతులు మాట్లాడితే..చెప్పుతో కొడతామంటూ ఘాటుగా కౌంటర్లు ఇచ్చారు. మంగళగిరిలో జనసేన ఆఫీసులో జరిగిన కార్యకర్తల సమావేశంలో పవన్ ..ఊహించని విధంగా వైసీపీపై విరుచుకుపడ్డారు. వైసీపీ వెదవలు, సన్నాసులు అంటూ రెచ్చిపోయారు. ఇటీవల విశాఖలో జరిగిన సంఘటనల నేపథ్యంలో పవన్..ఇప్పటినుంచి రాజకీయ ముఖచిత్రం మారబోతుందని, వైసీపీని గద్దె దించేవరకు విశ్రమించేది లేదంటూ మాట్లాడారు. అలాగే పోలీసులు కేసులు పెడితే..వారు ఒక్కటే గుర్తు పెట్టుకోవాలని రాబోయేది జనసేన ప్రభుత్వమని అన్నారు.
ఇక బూతు స్థాయిలో జనసేన తరుపున పోరాడే నాయకుడు ఉండాలని, వైసీపీపై యుద్ధం చేయాలని చెప్పుకొచ్చారు. వైసీపీలో ఉన్న కాపు ఎమ్మెల్యేలకు, మంత్రులకు పవన్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు..ఊడిగం చేసే సన్నాసులు అంటూ విరుచుకుపడ్డారు. మొత్తానికి వైసీపీపై ఇక నుంచి దూకుడుగా ముందుకెళ్లెలా ఉన్నారు. వైసీపీకి ధీటుగా స్పందించేలా ఉన్నారు.
ఇకపై వైసీపీ నేతలు తిడితే..రివర్స్‌లో తిట్టేలా ఉన్నారు. పూర్తిగా జనసేన శ్రేణులని రెచ్చిపోవాలనే విధంగా పవన్..కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అయితే నెక్స్ట్ రాబోయేది తమ ప్రభుత్వమే అంటున్నారు..కానీ జనసేనకు సింగిల్ గా గెలిచే శక్తి లేదు. మరి పవన్ ఏ ఉద్దేశంతో తమ ప్రభుత్వం వస్తుందని చెప్పారనేది చూస్తే..టీడీపీతో పొత్తు ఉద్దేశంతోనే పవన్ మాట్లాడినట్లు అర్ధమవుతుంది. అందుకే సీఎం పదవిపై తనకు ఆశ లేదని మరొకసారి స్పష్టం చేశారు. పోరాటంలో పదవి కూడా వస్తే మంచిదే అని చెప్పుకొచ్చారు. మొత్తానికైతే పవన్..వైసీపీపై ఇప్పటినుంచి పూర్తి స్థాయిలో యుద్ధం మొదలుపెట్టారని చెప్పొచ్చు. మరి చూడాలి రానున్న రోజుల్లో పవన్ రాజకీయం ఎలా ఉంటుందో.