పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా మరో ప్రాజెక్టుని ప్రారంభించారు. పవన్ కళ్యాణ్ కెరియర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ” ఉస్తాద్ భగత్ సింగ్ ” సినిమా నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
ఈ బ్లాక్ బాస్టర్ కలయికలో రెండవ సినిమా కోసం పవర్ స్టార్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం నేడు ఉదయం 11:45 గంటలకు లాంఛనంగా ప్రారంభించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గోపీచంద్ మలినేని, వివి వినాయక్, బుచ్చిబాబు, నిర్మాతలు దిల్ రాజు, ఏ ఎం రత్నం, సాహు గారపాటి, గోపి ఆచంట, రామ్ ఆచంట తదితరులు హాజరయ్యారు.
దిల్ రాజ్ క్లాప్ కొట్టగా.. ఏఎం రత్నం కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ముహూర్తపు చాట్ కి వేవేవి నాయకులు దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తూ ఉండగా.. అయాంక్ బోస్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.