మా నేతలను తక్షణమే రిలీజ్‌ చేయండి..లేకపోతే నేనే పోలీస్ స్టేషన్ కు వస్తా – పవన్

-

ఏపీ డీజీపీ కసిరెడ్డికి జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఓ రేంజ్‌లో వార్నింగ్‌.. ఇచ్చారు. తమ పార్టీ నేతలను తక్షణమే రిలీజ్‌ చేయండని..లేకపోతే నేనే పోలీస్ స్టేషన్ కు వస్తానని ట్వీట్‌ చేశారు పవన్‌ కళ్యాణ్‌. శనివారం రాత్రి విశాఖ నగరంలోని నోవాటెల్ హోటల్ లో పవన్‌ కళ్యాణ్‌ బస చేశారు. అయితే.. పవన్, నాగబాబు, నాదెండ్ల మనోహర్ బస చేసిన ఫ్లోర్ లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

నోవాటెల్ పరిసరాల్లోకి జనసేన కార్యకర్తలతో పాటు ఎవరు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. జనసేన నాయకులు కోన తాతారావు, సందీప్ పంచకర్ల, సుందరపు విజయ్ కుమార్, పి.వి.ఎస్.ఎన్.రాజు, యశస్విని, మూర్తి యాదవ్, గేదెల చైతన్య, కీర్తిష్, శ్రీధర్, ఉమాను పోలీసు అరెస్టు చేశారని నాగబాబు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

అయితే.. దీనిపై స్పందించారు పవన్‌. విశాఖపట్నంలో పోలీసుల ప్రవర్తనను చూడటం చాలా దురదృష్టకరం. జనసేన ఎల్లప్పుడూ AP పోలీసు బలగాలను ఎంతో గౌరవిస్తుంది. మన నాయకులను అరెస్టు చేయడం అనవసరమని ఫైర్‌ అయ్యారు. ఏపీ డీజీపీ తక్షణమే జోక్యం చేసుకుని మా నేతలను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news