బాలకృష్ణ పెద్ద కూతురు అత్యంత రూపవతి అయిన నారా బ్రాహ్మణి గురించి ప్రత్యేకంగా ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. ఇక ఈమె సినీ, మీడియా రంగాలకు దూరంగా ఉన్నప్పటికీ ప్రేక్షకులలో ఆమెకు మంచి గుర్తింపు కూడా ఉంది. తాజాగా ఆహా ఓటీటీ లో స్ట్రీమింగ్ అయిన అన్ స్టాపబుల్ షో ద్వారా లోకేష్, బ్రాహ్మణి ల లవ్ మ్యారేజ్ గురించి అసలు విషయాలు వెల్లడించారు. బ్రాహ్మణిని పెళ్లి గురించి అడిగితే చదువుకోవాలని ఇప్పుడే పెళ్లి ఇష్టం లేదని చెప్పిందని చంద్రబాబు వెల్లడించారు.. ఇక ఆ సమయంలో ఏం చెప్పి ఒప్పించావని బాలయ్య లోకేష్ ను అడగగా ఇద్దరం కలిసి చదువుకుందాం అని చెప్పి ఒప్పించానని లోకేష్ చెప్పాడు. ఇక నీకు కూడా మేనమామ పోలికలు వచ్చాయని బాలయ్య చెప్పారు. ఒక విధంగా లోకేష్, బ్రాహ్మణి ల మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అని బాలయ్య కామెంట్లు చేశారు.
లోకేష్ బ్రాహ్మణిల జోడి బాగుంటుందనే సంగతి తెలిసిందే. ఇక ఈ జోడి కి చాలామంది అభిమానులు కూడా ఉన్నారు. లోకేష్ ను హీరో చేయాలని అప్పట్లో చంద్రబాబు కూడా భావించారు. కానీ అదే సమయంలో లోకేష్ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెడితే సక్సెస్ అవుతారని కొంతమంది చెబితే మరి కొంతమంది ఫెయిల్ అయ్యేవారు అని అభిప్రాయపడ్డారు. ఇక రాజకీయాల్లో కూడా ఆయన ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేదు ఇక 2024 ఎన్నికల్లో అయినా కచ్చితంగా లోకేష్ విజయం సాధిస్తారని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక లోకేష్ కొన్ని విషయాలలో మారితే తప్ప ఆయన రాజకీయాలలో విజయం సాధించాలని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
మరోపక్క గతంతో పోల్చుకుంటే రాజకీయాలకు సంబంధించి లోకేష్ మారారు అని, మంగళగిరిలో లోకేష్ కు అనుకూల ఫలితాలు వస్తాయో రావో కానీ ఆయన కోసం అభిమానులు తరలిస్తున్నారు అని చెప్పడంలో సందేహం లేదు.