బాలికపై అఘాయిత్యం.. రోజా ట్వీట్‌కు పవన్ కళ్యాణ్ కౌంటర్!

-

ఏపీఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో ఓ బాలికపై లైంగికదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నిందితుడు టీడీపీ నేత అని పలు కథనాలు వెలువడ్డాయి. ఆ విషయాన్ని ప్రచురించిన పేపర్ క్లిప్‌ను మాజీ మంత్రి రోజా ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేస్తూ పవన్‌కళ్యాణ్‌ను విమర్శించారు. ‘పవన్‌ కళ్యాణ్ అనబడే ఉప ముఖ్యమంత్రి గారూ అంటూ ట్వీట్ చేసిన రోజా..దేవుడు తమరికి పుట్టుకతో బుద్ధి జ్ఞానం ఇచ్చి ఉంటే దాన్ని కాస్త ఉపయోగించండి స్వామి’ అంటూ విరుచుకుపడ్డారు.ఈ నేపథ్యంలో రోజా ట్వీట్‌పై డిప్యూటీ సీఎం స్పందించారు.

పిఠాపురానికి చెందిన బాలికపై మాధవపురం చెత్త డంపింగ్ వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన అఘాయిత్యం బాధ కలిగిందన్నారు.స్థానికులు అప్రమత్తమై నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారన్నారు. ఈ అమానుష చర్యను సభ్య సమాజంలోని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు.ఇక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించి మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా అధికారులను పవన్ ఆదేశించారు.బాధితురాలిని ఆదుకోవడంతో పాటు నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తాం అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version