సినిమాల్లో పవన్ వన్ మ్యాన్ షో ఉంటుంది గాని…రాజకీయాల్లో మాత్రం వన్ మ్యాన్ షో ఉండటం లేదు..పూర్తిగా ఆయన ఎవరోకరికి సపోర్ట్ గా ఉంటున్నారే తప్ప..ఆయనకంటూ సొంతమైన బలం ఎక్కువ కనిపించడం లేదు. ప్రజల సపోర్ట్ పెద్ద ఎత్తున దొరకడం లేదు. అలాగే ప్రజల సపోర్ట్ పెంచుకోవాలనే కోణంలో కూడా పవన్ రాజకీయం చేస్తున్నట్లు కనిపించడం లేదు..ఎప్పుడు ఏదొక పార్టీతో పొత్తు పెట్టుకునే ముందుకెళ్లెలా ఉన్నారు తప్ప..సొంతంగా సత్తా చాటాలని మాత్రం చూస్తున్నట్లు లేరు.
ఇంతకాలం ఆయన చేస్తున్న రాజకీయం బట్టి చూస్తే…ఎవరోకరికి మద్ధతుగానే ఉంటున్నారు తప్ప…సొంతంగా ప్రజల మద్ధతు పెంచుకోవడం లేదు. కానీ ఆయన ఫ్యాన్స్ మాత్రం..మా పవన్ అన్న సీఎం అయిపోతారని కలలు కంటున్నారు…అసలు ఏ సభలో చూసిన పవన్ సీఎం అని అరుస్తూనే ఉన్నారు. మరి ఫ్యాన్స్ అనుకున్నట్లు పవన్ సీఎం అయ్యే దిశగా వెళుతున్నారా? సీఎం అయ్యే బలం పెంచుకున్నారా? అంటే లేదు. ఇప్పటికీ మరో పార్టీతో పొత్తు కోసమే పవన్ రాజకీయం చేస్తున్నట్లు కనిపిస్తున్నారు.
అదేమంటే వైసీపీని ఓడించడానికి…వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వను అని చెబుతున్నారు…అసలు వైసీపీ వ్యతిరేక ఓటుని పక్కన పెడితే సొంతంగా సానుకూల ఓటుని పెంచుకోవాలి కదా..పవన్ మాత్రం అలా చేయడంలేదు. ఎలాగో పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఏదొక పార్టీతో పొత్తు పెట్టుకుంటూనే వచ్చారు..ఇప్పుడు కూడా బీజేపీతో కలిసి ముందుకెళుతున్నారు. అలాగే టీడీపీతో కలిసి పయనించాలని చూస్తున్నారు. నెక్స్ట్ ఎన్నికల సమయంలో ఖచ్చితంగా టీడీపీతో కలిసి పోటీ చేయడం ఖాయమని చెప్పొచ్చు. టీడీపీతో కలిస్తే..సీఎం అయ్యేది చంద్రబాబే…పవన్ కాదు. ఆ విషయం అందరికీ తెలుసు.
అయితే సీఎం సీటు పవన్ కు ఇస్తేనే పొత్తు పెట్టుకుంటామని జనసైనికులు అంటున్నారు…అంటే సొంతంగా సీఎం అవ్వలేరని అర్ధమైనట్లు ఉంది. అయినా సీఎం సీటు ఇవ్వడానికి టీడీపీ ఏమన్నా చిన్న పార్టీ కాదు కదా? ఆ విషయం జనసైనికులకు అర్ధమవుతున్నట్లు లేదు. మొత్తానికి చూసుకుంటే ఈ ఎన్నికల్లో కూడా పవన్ వన్ మ్యాన్ షో ఉండదనే చెప్పాలి.