పోలిటికల్ గేమ్: పవన్ రూట్ క్లియర్!

-

ఏపీ పోలిటికల్ గేమ్ లో ఎప్పుడు ఎలాంటి ట్విస్ట్ లు వస్తాయో అర్ధం కాకుండా ఉంది..రాజకీయంగా ఎవరు ఎవరికి దగ్గరవుతున్నారు…ఎవరు దూరం అవుతున్నారో అనేది క్లారిటీ లేదు. బయట కుస్తీ…లోపల దోస్తీ చేసే విషయంలో ఏ పార్టీ వెనక్కి తగ్గడం లేదు. పైకి ఏమో జనసేన-బీజేపీలు దోస్తీ చేస్తున్నాయి..కానీ వెనుక బీజేపీ ఏమో వైసీపీతో, జనసేన ఏమో టీడీపీతో జట్టు కడుతున్నట్లు కనిపిస్తున్నాయి. అయితే జనసేన అధినేత పవన్ కల్యాణ్…ఇప్పటివరకు బీజేపీని వదిలి పెట్టారనే అంతా అనుకున్నారు…కానీ తాజా రాజకీయ పరిస్తితులని చూస్తుంటే ఆయన..బీజేపీని వదిలేసేలా ఉన్నారు.

వాస్తవానికి ఆయన వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకూడదనే ఉద్దేశంతో ఉన్నారు..ఈ క్రమంలోనే ఆయన టీడీపీకి దగ్గరవుతున్నారని అర్ధమైంది. కానీ అదే సమయంలో బీజేపీ ఏమో టీడీపీకి దూరంగానే ఉండాలని అనుకుంటుంది. మళ్ళీ చంద్రబాబుని నమ్మి మోసపోకూడదని భావిస్తుంది. అయితే పవన్ ఏమో బీజేపీని ఒప్పించి బాబుతో కలవాలని చూస్తున్నారు.

ఇక ఇదే సమయంలో వైసీపీతో బీజేపీ రహస్య స్నేహం చేస్తుందని అందరికీ అర్ధమవుతుంది. ముందు నుంచి జగన్…కేంద్రంలోని మోదీ సర్కార్ కు ఎదురు మాట్లాడిన సందర్భం లేదు. పైగా తాజాగా మోదీ పాల్గొన్న భీమవరం సభకు  తన ప్రత్యర్ధులని జగన్ రానివ్వలేదు..చంద్రబాబు, పవన్ సభకు రాలేదు. దీంతో వారిని బీజేపీకి దూరం చేసి…తాను దగ్గరవుతున్నారని తెలుస్తోంది.

ఈ విషయంలో పవన్ కు కూడా ఫుల్ క్లారిటీ వచ్చినట్లే కనిపిస్తోంది..ఇక ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించాలని చూస్తున్న పవన్..బీజేపీని నమ్ముకుంటే కష్టం..అందుకే ఆయన క్లారిటీగా చంద్రబాబుతో కలిసే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ ఎలాగో బాబుతో కలవదు కాబట్టి..పవన్, బీజేపీని వదిలిపెట్టడం గ్యారెంటీ అన్నట్లు ఉంది.

అటు కేంద్ర సహకారం కావాలి కాబట్టి జగన్..బీజేపీని వదలరు. దీని బట్టి చూస్తే ఏపీలో పోలిటికల్ గేమ్ పూర్తిగా అర్ధమవుతుందని చెప్పొచ్చు. టీడీపీ-జనసేన తప్పనిసరిగా కలవడం, అలాగే బీజేపీతో వైసీపీ రహస్య స్నేహం..ఎన్నికల ముందు ఇదే జరిగే ఛాన్స్ ఉంది. దీంతో పోలిటికల్ వార్ మరింత ఆసక్తికరంగా మారుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version