పోలీసుల తీరు మారకుంటే నేనే రోడ్డెక్కుతానని వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. శాంతి భద్రతలకు విఘాతం కలిగించకూడదనే సంయమనం పాటిస్తున్నా….జెండా దిమ్మలు పగుల కొట్టిన వైసీపీ నేతలపై కేసులు ఎందుకు పెట్టరు..? అని నిలదీశారు. జనసేన పార్టీ జెండా ఆవిష్కరణలను వైసీపీ వర్గాలు అడ్డుకున్న తీరు వారిలోని ఓటమి భయాన్ని తేటతెల్లం చేస్తోంది…పోతిన మహేష్ ను అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నానని పేర్కొన్నారు.
జగ్గయ్యపేటలోనూ జనసేన పతాక ఆవిష్కరణ కోసం పార్టీ శ్రేణులు నిర్మించుకున్న జెండా దిమ్మెను వైసీపీ నేతలు జేసీబీతో కూల్చేశారు…దీనిపై కేసు నమోదు చేయడానికి బదులు ప్రశ్నించిన జనసేన నాయకులపై కేసులు పెట్టడం ఎంతవరకు న్యాయమో పోలీస్ అధికారులు ఆలోచించాలని కోరారు.జనసేన శ్రేణులు తలపెడుతున్న ప్రతి కార్యక్రమాన్ని అనుమతి లేదన్న సాకుతో పోలీసులు అడ్డుకుంటున్నారన్నారు.
ఇది పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలకడంగానే భావిస్తున్నాం.*అధికార పార్టీ అన్ని కార్యక్రమాలను ముందస్తు అనుమతితోనే చేస్తున్నారా?**వారు వాడవాడల్లో పెట్టిన విగ్రహాలకు, జెండా దిమ్మలు, వారు వేస్తున్న రంగులకు ముందుగా మున్సిపల్, పంచాయితీల అనుమతి తీసుకుంటున్నారా..? అని ప్రశ్నించారు. అన్నిటికీ అనుమతులు ఉన్నాయని పోలీసులు ప్రకటించగలరా..?అనుమతులు లేకపోతే వాటిని తొలగిస్తారా..అని నిలదీశారు. పోలీసులు ధర్మాన్ని పాటించాలి.. జనసేన ఉనికిని తీసిపారేయడం ఎవరి తరం కాదన్నారు పవన్ కళ్యాణ్.