ఆధార్ కార్డు ని అప్డేట్ చెయ్యాలనుకుంటున్నారా..? ఎంత పే చెయ్యాలి మొదలైన వివరాలివే..!

-

మనకి వుండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డు ఒకటి. ఆధార్ వలన ఎన్నో లాభాలు వున్నాయి. అయితే ఆధార్ ని అప్డేట్ చేసుకోవడం చాలా ముఖ్యం. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా ఆధార్ ని అప్డేట్ చేసుకోవడానికి పే చెయ్యాల్సి వుంది.

ఇక దీని కోసం పూర్తి వివరాలను చూస్తే.. ఆధార్‌కు సంబంధించిన అప్‌డేట్ కోసం మీరు కొంత అమౌంట్ పే చెయ్యాలి. అయితే ఇలాంటి డీటెయిల్స్ ని కనుక మీరు తెలుసుకోకపోతే ఆధార్ సెంటర్ కి వెళ్ళినప్పుడు ఇబ్బంది పడాలి.

0-5 సంవత్సరాలు వాళ్ళు ఆధార్ ని అప్డేట్ చేసుకోవాలంటే ఎలాంటి రుసుము చెల్లించక్కర్లేదు.
5 ఏళ్లు పైబడినవారికి కూడా ఫ్రీ ఏ. ఎలాంటి ఫీజు కట్టక్కర్లేదు.
తప్పనిసరి బయోమెట్రిక్‌ అప్‌డేట్‌ కి డబ్బులేమీ పే చెయ్యక్కర్లేదు. ఫ్రీ ఏ.
ఇక డెమోగ్రాఫి అప్‌డేట్స్‌ కోసం అయితే వంద చెల్లించాలి.
జనాభా నవీకరణ కోసం అయితే రూ.50 చెల్లించాలి.
మై ఆధార్‌ పోర్టల్‌ నుంచి గుర్తింపు, నివాస ధృవీకరణ పత్రం అప్‌లోడ్‌ కనుక చేస్తే రూ.25 కట్టాలి.
ఐడెంటిటీ ప్రూఫ్ లేదా నివాస రుజువులో అప్‌డేట్‌ కోసం రూ.50 పే చెయ్యాలి.
ఇ-కేవైసీ కోసం ఆధార్‌ లింక్‌ చెయ్యాలంటే రూ.30 పే చెయ్యాలి.
పిల్లల వయస్సు 5 సంవత్సరాల కంటే తక్కువ ఉంటే వారికీ ఆధార్ లో మార్పులు చేయడం కోసం ఎలాంటి రుసుము చెల్లించక్కర్లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version