అమరరాజా గురించి పెద్దగా ఐడియా లేదు : మంత్రి పెద్దిరెడ్డి

-

అమరరాజా గురించి పెద్దగా ఐడియా లేదని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. అమరరాజా పై మీడియా ఏమి రసారో అదే నాకు తెలుసు చెప్పాల్సి ఉంటే అదే చెప్పాలని.. దీనిపై మాకు సొంత అభిప్రాయం లేదని తెలిపారు. ఈ ఫ్యాక్టరీ ఇష్యూ తో పొలిటికల్ గా ప్రభుత్వాన్ని డామేజ్ చేయాలనుకుంటున్నారని…10 ఏళ్ల తరువాత ఫ్యాక్టరీ ని రీ లోకాట్ చేయాలి అని ఉందని వెల్లడించారు. చిత్తూరు దగ్గర 4, 5 వేల ఎకరాలు తీసుకున్నారు అక్కడకు రిలోకేట్ చెయ్యొచ్చని చెప్పారు.

వాళ్ళు పొరుగు రాష్ట్రాల ఇన్సెంటివ్స్ కోసం వెళితే ఏమి చేయాలని.. అమరరాజా వెళ్లిపోవాలని కోరుకుంటున్నట్టు సజ్జల చెప్పలేదని క్లారిటీ ఇచ్చారు. ఈ వ్యవహారం పై సజ్జల కూడా వివరణ ఇచ్చారన్నారు. పంచాయతీ రాజ్ శాఖ లో చాలా సంవత్సరాలు గా పెండింగ్ లో ప్రమోషన్ లు ఉన్నాయని.. 315 మందికి 25 సంవత్సరాల అయిన ప్రమోషన్స్ రాలేదన్నారు. దీనితో వీరి కింద ఉన్న 18500 మందికి ప్రమోషన్స్ ఆగిపోయాయని.. ఎంపిడిఓ లలో ఉన్న పొరపచ్చలను సరి చేసామని తెలిపారు. మా శాఖ కోసం ఇతర శాఖల నుండి డెప్యూటేషన్ మీద తీసుకున్న సందర్భం ఉందని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news