కేసీఆర్ సమక్షంలో టిఆర్ఎస్ లో చేరిన పెద్దిరెడ్డి

-

తెలంగాణ ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు సమక్షంలో…. బిజెపి మాజీ నేత పెద్దిరెడ్డి ఇ టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కండువా కప్పి… పెద్ది రెడ్డి ని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి తో పాటు ఆయన అనుచరులు.. కూడా టిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

కాగా ఇటీవలె మాజీ మంత్రి పెద్దిరెడ్డి బిజెపి పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేరికతో… అసంతృప్తిని వ్యక్తం చేసిన పెద్దిరెడ్డి బిజెపి పార్టీకి రాజీనామా చేశారు. ఈటెల రాజేందర్ చేరిక తర్వాత… బిజెపి పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత కల్పించడం లేదని పెద్దిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే బిజెపి పార్టీకి నాలుగు రోజుల కింద రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ  పెద్దిరెడ్డి..సిఎం కెసిఆర్ సమక్షంలో  టిఆర్ఎస్ పార్టీ లో చేరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version