బరువు తగ్గాలనుకునే వారు గ్రీన్ టీ మొదలు కూరగాయల రసం వరకు ఎన్నో వాటిని తీసుకోచ్చు..!

-

ఉండవలసిన దాని కంటే ఎక్కువ బరువు ఉండటం ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకని బాగా బరువుగా ఉన్న వాళ్ళు బరువు తగ్గడానికి చూసుకోవాలి. ఎంత బరువు ఉండాలో అంతే బరువును మెయింటైన్ చేస్తే మంచిది. ప్రతి రోజు కూడా కాసేపు మీ సమయాన్ని వ్యాయామానికి కేటాయించాలి.

 

అప్పుడు కచ్చితంగా బరువు తగ్గొచ్చు. అదే విధంగా ఇక్కడ ఉన్న కొన్ని చిట్కాలు వున్నాయి. వీటిని కనుక మీరు అనుసరించారు అంటే ఖచ్చితంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అయితే మరి ఎలా బరువు తగ్గాలి అనేది ఇప్పుడు చూద్దాం.

నీళ్లు:

నీళ్లు ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. బరువు తగ్గడానికి బాగా సహాయపడుతాయి. అలానే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. తక్కువ నీళ్లు తాగడం వల్ల ఒబేసిటీ సమస్య కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి శరీరానికి అవసరమైనంత నీళ్లను తీసుకోండి.

గ్రీన్ టీ:

గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా మంచిది. అలానే బరువు తగ్గడానికి సహాయపడుతుంది. గ్రీన్ టీ ని కూడా రెగ్యులర్ గా తీసుకుని బరువు తగ్గండి.

తేనె మరియు నిమ్మరసం:

నిజానికి చాలామంది ఈ పద్ధతిని ఫాలో అవుతూ ఉంటారు. గోరువెచ్చని నీళ్ళు తీసుకొని ఉదయాన్నే లేవగానే కొద్దిగా తేనె నిమ్మరసం వేసుకుని దీనిని తీసుకుంటే బరువు తగ్గడానికి అవుతుంది. అలానే రక్తం ప్యూరిఫై అవుతుంది.

కాఫీ:

కాఫీ కూడా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇది మూడ్ ని కూడా మారుస్తుంది. అలానే ఎనర్జీ లెవల్స్ ను పెంచుతుంది.

హై ప్రోటీన్ డ్రింక్స్:

ప్రోటీన్ ఎక్కువగా ఉండే డ్రింక్స్ ను తీసుకోవడం వల్ల కూడా బరువు తగ్గొచ్చు. ఇది ఆకలిని తగ్గిస్తుంది అయితే వ్యాయామం చేస్తున్నట్లయితే మాత్రమే దీనిని తీసుకోండి లేదంటే బరువు పెరిగిపోతారు.

కూరగాయల రసం:

తక్కువ క్యాలరీలు ఉండే కూరగాయల జ్యూస్ తీసుకోవడం వల్ల కూడా బరువు తగ్గడానికి అవుతుంది. ఎందుకంటే కూరగాయల రసం లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. చూశారు కదా ఎలా ఈజీగా బరువు తగ్గాలి అనేది. మరి ఈ టిప్స్ ని ఫాలో అయ్యి ఈజీగా బరువు తగ్గండి.

Read more RELATED
Recommended to you

Latest news