ఎలాన్‌ ఎఫెక్ట్‌.. పెప్సీ కో లోనూ ఉద్యోగులకు ఉద్వాసన

-

ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం కొట్టచ్చినట్లు కన బడుతోంది.ఈ నేపథ్యంలోనే గ్లోబల్‌ టెక్‌ కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అమె జాన్‌, మెటా, ట్విట్టర్‌, జొమాటో బాటలోనే తాజాగా గూగుల్‌ మాతృసంస్థ అల్బాబెట్‌ కూడా భారీగా ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నట్లు సమాచారం. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చేతికి వచ్చాక మొదలైన ఉద్యోగుల కోత మిగతా సంస్థలకూ పాకింది. ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా, అమెజాన్, హెచ్‌పీ, యాపిల్ సహా పలు టెక్ కంపెనీలు కూడా ఉద్యోగులను వదిలించుకుంటున్నాయి. ఆర్థిక మాంద్యం, మార్కెట్ ఒడిదొడుకులే ఇందుకు కారణంగా చెబుతున్నాయి. 2025 నాటికి దాదాపు 6 వేల మందిని తొలగిస్తామని హెచ్‌పీ ఇటీవల ప్రకటించగా, అమెజాన్ 20 వేల మందిని ఇంటికి పంపిస్తోంది. తొలుత 10 వేలమందిని తొలగిస్తున్నట్టు వార్తలు రాగా ఆ తర్వాత ఆ సంఖ్య 20 వేలకు పెరిగింది. ఇందులో అన్ని గ్రేడ్ల ఉద్యోగులూ ఉన్నారు. ఫేస్‌బుక్‌లో దాదాపు 11 వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు.

Pepsi warns that prices may continue to rise - AS USA

మరికొన్ని కంపెనీలు కూడా ఇదే బాటలో నడుస్తుండగా, తాజాగా ఈ జాబితాలోకి పెప్సీ కో వచ్చి చేరింది. నార్త్ అమెరికాలోని స్నాక్ అండ్ బేవరేజెస్ యూనిట్‌లో వందలాదిమంది ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధం చేసినట్టు ‘వాల్‌స్ట్రీట్’ జర్నల్ పేర్కొంది. ఉద్యోగులు అందుకున్న ఇంటర్నల్ మెమోలను ఉటంకిస్తూ ఈ విషయాన్ని వెల్లడించింది. సంస్థను మరింత సులభతరంగా మార్చడంలో భాగంగా ఉద్యోగులకు లేఆఫ్ ఇస్తున్నట్టు తన కథనంలో పేర్కొంది. అయితే, పెప్సీ మాత్రం ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించలేదు. పెరిగిన చక్కెర, మొక్కజొన్న, బంగాళదుంపల ధరలతో పెరిగిన భారాన్ని పెప్సీ కో వినియోగదారులపైకి నెట్టేస్తుంది. అయినప్పటికీ ఉద్యోగుల తొలగింపు నిర్ణయం ఆశ్చర్యం కలిగిస్తోంది. అంతేకాదు, ధరలు పెరిగినప్పటికీ తమ ఉత్పత్తులు మార్కెట్లో ఇంకా బలంగానే ఉన్నాయని చెప్పడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news