జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు. జగన్ పై మాట్లాడినట్లు.. దమ్ము ఉంటే తెలంగాణ సిఎం కెసిఆర్ ను తిట్టాలని పవన్ కళ్యాణ్ కు సవాల్ విసిరారు. మీడియాను తిట్టే ముందు రోడ్లు సరిగ్గా లేవని కేసిఆర్ ను ప్రశ్నించాలన్నారు. కేసియర్ పై నోరు తెరవాలి అంటే నువ్వు ప్యాంట్లు తడుపుకుంటాడని ఎద్దేవా చేశారు.
పవన్ గొప్ప వ్యక్తిగా తనకు తాను ఊహించుకుంటూన్నారని.. తెలంగాణలో 519 థియేటర్లు ఉంటే 419 సినిమా హాళ్లు మూసి ఉన్నాయని పవన్ తెలుసుకోవాలని చురకలు అంటించారు. మూడు రోజుల నుంచి ఏపీలోని 510 థియేటర్లలో లవ్ స్టొరీ సినిమా ఆడుతుందని.. సినిమా పరిశ్రమను సీఎం జగన్ ఎటువంటి ఇబ్బందులు పెట్టారో చెప్పాలని ప్రశ్నించారు.
తాను.. పవన్ ఒకే కులం, తాను సన్నాసి అయితే పవన్ కూడా సన్యాసేనని చురకలు అంటించారు. మా వేదవన్నర వేదవ పవన్ ఏమి ఏమి మాట్లాడాడో అర్థం కావడం లేదని.. సాయి ధరమ్ తేజ్ ప్రమాదాన్ని మధ్యలోకి ఎందుకు లాగావ్ అని నిప్పులు చెరిగారు. ఇండియా కూడా రిపబ్లిక్ దేశం అని పవన్ తెలుసుకోవాలన్నారు. మేము సంపాదించుకుంటే మీకు పన్నులు, జిఎస్టీ ఎందుకు కట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదేనని.. మా ఎన్నికల్లో ఓట్ల కోసమే పవన్ తిప్పలు అని అందరికి తెలుసన్నారు.